సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్లే సమయంలో పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపోయింది.
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసి ఇంటి ముందు పడేశారు. జయప్రకాష్ (22) అనే యువకుడిని హత్య చేసి శవాన్ని ఇంటి ముందు పడేశారు. మృతుడు మేస్త్రి వర్క్ చేస్తూ జీవిస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోల్ చెందిన వ్యక్తిగా గుర్తింపు. బొల్లారం మున్సిపల్ కెబిఆర్ కాలనిలో నివసిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువకుడి…
కొన్ని ప్రేమలు పెళ్లి పీటలెక్కుతుంటే.. మరికొన్ని ప్రేమలు కాటికి చేరుతున్నాయి. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో తనువులు చాలిస్తున్నారు కొందరు యువతీ యువకులు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అన్న వరస అవుతాడని ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ప్రేమను వదులుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. Also Read:Sri Lanka: శ్రీలంకలో ఘోర విషాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది…
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. అమ్మ దైవంతో సమానం. ఎన్ని కష్టాలు వచ్చిన ఎదురునిలిచి కన్న బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. పిల్లలకు చిన్న కష్టం వచ్చినా ఆ తల్లి విలవిల్లాడిపోతది. కానీ, ఓ తల్లి మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తించింది. పరాయి వ్యక్తి మోజులో పడి కన్న కొడుకుపై రాయితో దాడి చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం మార్వెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కన్న కొడుకుపై రాయితో దాడి…
BRS vs Congress : సంగారెడ్డి జిల్లా హత్నూరులో శుక్రవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ ఘర్షణలకు వేదికైంది. ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం క్రమంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇది కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే…
ప్రేమ కోసం ప్రాణాలు తీయడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రామచంద్రపురం పి యస్ పరిధిలోని బండ్లగూడ బాలాజీనగర్ లో చోటుచేసుకుంది. చనిపోయిన యువతిని రమ్యగా గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రియుడు ప్రవీణ్ ను ఆస్పత్రికి తరలించారు. Also Read:Hacking: ఇది…
సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల శరీర భాగాలను సేకరించి.. పటాన్ చెరువు ప్రభుత్వ ఆస్పత్రి మార్చరీకి తరలించారు. ఈ సందర్భంగా మార్చరీలో ఉన్న మృతదేహాలకు వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏతో మ్యాచ్ చేసి అప్పగిస్తున్నారు. అయితే, ఈ రోజు మరో 13 మృతదేహాలను అధికారులు గుర్తించారు.
Sigachi Factory Blast: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలోని ఫార్మా కారిడార్ లోని పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ప్రమాదంలో సుమారు 45 మందికి పైగా కార్మికులు మృతి చెందారు. అయితే, పేలుడు ధాటికి ఘటన స్థలంలో పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల శరీర భాగాలు పూర్తిగా చిద్రం అయిపోయాయి.
సంగారెడ్డి జిల్లా చేర్యాల గేటు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్సై రాజేశ్వర్ గౌడ్ మృతి చెందారు. బల్కంపేటలో బందోబస్తుకు వచ్చిన రాజేష్ గౌడ్.. బందోబస్తు ముగించుకొని కార్ లో తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో లారీని వెనుకాల నుంచి కార్ డీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎస్సై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై రాజేశ్వర్ స్వస్థలం సంగారెడ్డిలోని చాణక్యపురి కాలని. రోడ్డు ప్రమాదంలో…