కొన్ని ప్రేమలు పెళ్లి పీటలెక్కుతుంటే.. మరికొన్ని ప్రేమలు కాటికి చేరుతున్నాయి. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో తనువులు చాలిస్తున్నారు కొందరు యువతీ యువకులు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అన్న వరస అవుతాడని ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ప్రేమను వదులుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read:Sri Lanka: శ్రీలంకలో ఘోర విషాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన ధనావత్ స్వరూప, కేశ్య నాయక్ దంపతుల మూడో కూతురు సక్కుబాయి(21). ఎంబీఏ పూర్తిచేసి, గ్రూప్-2 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతోంది. అయితే హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే సమయంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పింది. అయితే తను ప్రేమించిన వ్యక్తి వరసకు అన్న అవుతాడని పెళ్లి కుదరదని పేరెంట్స్ సర్ది చెప్పారు. ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక మానసికంగా కుంగిపోయింది.
Also Read:Khairatabad : గణేషున్ని చూడ్డానికి వెళితే.. 900 మంది పోకిరీలు అరెస్ట్..
ఈ క్రమంలో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో గడ్డిమందు తాగి తండ్రికి సమాచారం ఇచ్చింది. వెంటనే ఇంటికి చేరుకున్న తండ్రి నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందింది. ఉన్నత ఉద్యోగం సాధించి తమకు ఆసరగా నిలుస్తుందనుకున్న కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.