ఎన్టీయార్ నిర్వహిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో నిదానంగా ఫిల్మ్ స్టార్స్ పార్టిసిపేషన్ తో మరింత కలర్ ఫుల్ కాబోతోంది. తాజాగా ఈ షోకు ప్రిన్స్ మహేశ్ బాబు హాజరయ్యాడన్నది తెలిసిందే. మహేశ్ బాబు ఈ గేమ్ లో పాల్గొని ఎంత మొత్తం గెలుచుకున్నాడో తెలియదు కానీ, ఆ ఎపిసోడ్ ప్రసారం కాకముందే, సమంత సైతం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు హాజరైందనేది రూఢీ అయ్యింది. ఆమె మేనేజర్ మహేంద్రతో కలిసి ఈ కార్యక్రమంలో అందుకున్న చెక్ ను…
2017 అక్టోబర్ 7వ తేదీ అక్కినేని నాగచైతన్య, సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రోజు. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున గోవాలో హిందు సంప్రదాయ పద్ధతిలోనూ, ఆ తర్వాత క్రైస్తవ సంప్రదాయంలోనూ వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పదేళ్ళ స్నేహం, ఏడేళ్ళ ప్రేమ, నాలుగేళ్ళ వివాహ బంధం అక్టోబర్ 2న పటాపంచలైపోయింది. అదే జరిగి ఉండకపోతే, ఇవాళ వారిద్దరూ అందరికీ దూరంగా ఏకాంతంగా తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుని ఉండేవారేమో! చైతు సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో…
“మా శ్రేయోభిలాషులందరికీ. చాలా చర్చల తర్వాత మా స్వంత మార్గాలు కొనసాగించడానికి చై, నేను భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేము ఒక దశాబ్దం పాటు స్నేహంగా ఉండటం అదృష్టం. మా మధ్య ఎప్పటికీ ఒక ప్రత్యేక బంధం ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఈ క్లిష్ట సమయంలో మాకు సపోర్ట్ చేయాలని, మేము లైఫ్ లో ముందుకు సాగడానికి అవసరమైన గోప్యతను ఇవ్వమని మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియాను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ సపోర్ట్ కు ధన్యవాదాలు”……
క్రేజీ కపుల్ నాగ చైతన్య, సమంతల విడాకుల విషయం ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. గత శనివారం వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో విడిపోతున్నట్లు ప్రకటించారు. కొన్నాళ్ల నుంచి చక్కర్లు కొడుతున్న రూమర్స్ కు చెక్ పెడుతూ విడాకుల విషయాన్ని ప్రకటించి నాలుగేళ్ళ పెళ్ళి బంధానికి ముగింపు పలికారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే తాము భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటామని, తమ ప్రైవసీకి ఇబ్బంది కలిగించొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా…
గత శనివారం నుంచి సమంతకు సంబంధించి ఏ న్యూస్ వచ్చినా ఆసక్తిగా గమనిస్తున్నారు ప్రేక్షకులు. నాగ చైతన్య, సమంత తమ విడాకుల విషయమై సోషల్ మీడియాలో స్టేట్మెంట్లను పోస్ట్ చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం అక్కినేని అభిమానులు, సామ్ ఫ్యామిలీతో పాటు సినీ ప్రియులందరికీ భారీ షాక్ ఇచ్చింది. వాళ్ళు అలా ప్రకటించారో లేదో విడాకులకు అసలు కారణం ఏంటి ? అనే విషయంపై ఆరాలు తీయడం మొదలు పెట్టారు. మరికొంత మంది ఒకడుగు ముందుకేసి…
సమంత, నాగచైతన్య విడాకుల ముచ్చట ఇటు టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్, బాలీవుడ్ లోను చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్ తో పాటే సినీ సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. అయితే అనవసరమైన ఊహాగానాలు చేయవద్దని సీనియర్ నటి ఖుష్బూ కోరింది. ‘భార్యభర్తల మధ్య ఏం జరిగిందనేది..? వాళ్ళు ఎందుకు విడిపోయారు..? అనేది వాళ్ళిద్దరికీ తప్ప మూడో వ్యక్తికి తెలిసే ఛాన్స్ లేదని ఖుష్బూ తెలిపింది. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. వాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలి.…
సినీ స్టార్స్ కు ఏ రేంజ్ లో అభిమానులు ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా టైమ్ నడుస్తున్న కాలంలో తారలు మరింతగా ఫ్యాన్స్ కు దగ్గర అవుతున్నారు. సినిమా అప్డేట్స్ తో పాటు, లైవ్ లోకి వచ్చి అభిమానులు అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కు, స్టార్స్ కు మరింత కమ్యూనికేషన్ ఏర్పడుతోంది. ఒకప్పుడు తరాల సినిమా రికార్డ్స్ మాత్రమే మాట్లాడుకొనే ఫ్యాన్స్, ఇప్పుడు సోషల్ మీడియా…
టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే గతంలో సమంత పేరు మార్చుకున్నప్పుడే చాలా వరకు వారి విడాకుల విషయమై తెలిసిపోయింది. సమంత అక్కినేని గా ఉన్న పేరును ఆమె ఎస్ గా మార్చారు. ఇలా కొన్నాళ్ల పాటు కొనసాగిన సమంత మరోసారి తాజాగా సోషల్ మీడియాలో తన పేరును మార్చారు. అధికారికంగా విడాకుల తీసుకున్న మరుసటి రోజే ‘ఎస్’ అక్షరాన్ని తొలగించి ‘సమంత’గా మార్చేసుకోంది. నాగ…
నిన్న సమంత రూత్ ప్రభు మరియు నాగ చైతన్య విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘మా శ్రేయోభిలాషులందరికీ. చాలా చర్చలు, ఆలోచనల తరువాత చై, నేను మా స్వంత మార్గాలను అనుసరించడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఒక దశాబ్దానికి పైగా స్నేహంగా కలిసి ఉండటం మా అదృష్టం, ఇది మా మధ్య ఒక ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంటుందని మా నమ్మకం. ఈ కష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మాకు మద్దతివ్వాలని, మేము ముందుకు సాగడానికి…
స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత నిన్న తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా వీరి విడాకుల విషయమై సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే వాటిపై ఇన్నాళ్లూ స్పందించని సమంత, చై ఎట్టకేలకు విడాకుల విషయాన్నీ బయట పెట్టారు. అక్కినేని జంట విడిపోయినట్లు ప్రకటించిన వెంటనే, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ‘విడాకుల సంస్కృతి’, అది ఎలా పెరుగుతోంది అనే దానిపై వ్యాఖ్యానించింది. బాలీవుడ్ ‘విడాకుల…