యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”. ప్రారంభం నుంచీ షోకు పెద్దగా రేటింగ్ రాకపోవడంతో ఈ పండగకు ఎలాగైనా షోకు మంచి రేటింగ్ వచ్చేలా హైప్ పెంచాలని చూస్తున్నారు మేకర్స్. అందుకే ఈ షోకు రాజమౌళి, సమంత, మిల్కీ బ్యూటీ తమన్నా వంటి స్టార్స్ ను స్పెషల్ గెస్టులుగా తీసుకొస్తున్నారు. ఇలాంటి స్టార్స్ షోలో పాల్గొంటున్నారని వార్తలు వస్తున్నప్పటి నుంచీ వాళ్ళు గేమ్ ఎలా ఆడతారు ? హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ ఎలాంటి ప్రశ్నలు వేస్తారు ? ఇంకా ఎలాంటి ఆసక్తికర విషయాలను ఈ సెలెబ్రిటీలు బయట పెడతారు ? అనే ఆతృత మొదలైంది ప్రేక్షకుల్లో. అయితే తాజాగా నవరాత్రుల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సామ్ ఎపిసోడ్ ను ప్రసారం చెయ్యాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.
Read Also : వాట్ అమ్మా.. వాట్ ఈజ్ ఈజ్ దిస్ అమ్మా !
దసరా కానుకగా రానున్న ఈ షోకు సంబంధించిన ప్రోమోను సైతం విడుదల చేశారు. సామ్ గత కొన్ని రోజుల నుంచి విడాకుల విషయమై వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షోలో సమంత తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతుందేమో చూడాలి. ఇంకా విడాకుల ఎందుకు తీసుకున్నారు ? అనే విషయంపై కూడా క్లారిటీ ఇస్తే ఈ రూమర్లకు చెక్ పడుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. కానీ ఏం జరుగుతుందో దసరా రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లోనే చూడాలి. మరి సమంతకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ఈ షో రేటింగ్ ను పెంచడానికి ఏమాత్రం ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే.