అక్కినేని యువహీరో అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాతో నైనా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని అఖిల్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. బొమరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హేగ్డే కథానాయిక. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి అఖిల్ ఓ అరుదైన రికార్డ్ సృష్టించారు. నాగార్జున హోస్ట్ చేస్తున్న పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ లో రెండోసారి తన ‘బ్యాచ్ లర్’ సినిమా గురించి ప్రచారం చేసుకున్నాడు అఖిల్. ఇలా ఒక సినిమా గురించి రెండు సీజన్స్ లో ఇంత వరకూ ఏ హీరో హీరోయిన్ తమ సినిమాల ప్రయోషన్ చేయటం జరగలేదు.
Read Also : సాంగ్ : ‘శ్రీవల్లి’పై ‘పుష్ప’రాజ్ మెలోడియస్ ఫీలింగ్స్
బిగ్ బాస్ సీజన్ 5లో గత వారం అఖిల్, పూజా హెగ్డే ప్రత్యేకంగా పాల్గొని దసరాకి విడువల అవుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ గురించి ప్రమోట్ చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా దసరా పండగ సందర్భంగా ఇదే సినిమాను అఖిల్ ప్రమోట్ చేయటం విశేషం. గత ఏడాది దసరాకి సమంత రెండు ఎపిసోడ్స్ హోస్ట్ చేసినప్పుడు అఖిల్ అతిథిగా పాల్గొని తన సినిమాకు ప్రచారం చేసుకున్నాడు. ఇలా ఓ నటుడికి రెండుసార్లు ఇలాంటి అవకాశం లభించటం ఖచ్చితంగా ప్రత్యేకతతో కూడిన అంశమే. కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమా విడుదల ఆలస్యం కావటం వల్లే ఇలాంటి అరుదైన అవకాశం అఖిల్ ని పలకరించిందని చెప్పవచ్చు. మరి ఈ సినిమాతో నైనా అఖిల్ తొలి హిట్ అందుకుంటాడేమో చూడాలి.