సమంత, నాగచైతన్య విడాకుల ముచ్చట ఇటు టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్, బాలీవుడ్ లోను చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్ తో పాటే సినీ సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. అయితే అనవసరమైన ఊహాగానాలు చేయవద్దని సీనియర్ నటి ఖుష్బూ కోరింది. ‘భార్యభర్తల మధ్య ఏం జరిగిందనేది..? వాళ్ళు ఎందుకు విడిపోయారు..? అనేది వాళ్ళిద్దరికీ తప్ప మూడో వ్యక్తికి తెలిసే ఛాన్స్ లేదని ఖుష్బూ తెలిపింది. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. వాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలి.…
సినీ స్టార్స్ కు ఏ రేంజ్ లో అభిమానులు ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా టైమ్ నడుస్తున్న కాలంలో తారలు మరింతగా ఫ్యాన్స్ కు దగ్గర అవుతున్నారు. సినిమా అప్డేట్స్ తో పాటు, లైవ్ లోకి వచ్చి అభిమానులు అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కు, స్టార్స్ కు మరింత కమ్యూనికేషన్ ఏర్పడుతోంది. ఒకప్పుడు తరాల సినిమా రికార్డ్స్ మాత్రమే మాట్లాడుకొనే ఫ్యాన్స్, ఇప్పుడు సోషల్ మీడియా…
టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే గతంలో సమంత పేరు మార్చుకున్నప్పుడే చాలా వరకు వారి విడాకుల విషయమై తెలిసిపోయింది. సమంత అక్కినేని గా ఉన్న పేరును ఆమె ఎస్ గా మార్చారు. ఇలా కొన్నాళ్ల పాటు కొనసాగిన సమంత మరోసారి తాజాగా సోషల్ మీడియాలో తన పేరును మార్చారు. అధికారికంగా విడాకుల తీసుకున్న మరుసటి రోజే ‘ఎస్’ అక్షరాన్ని తొలగించి ‘సమంత’గా మార్చేసుకోంది. నాగ…
నిన్న సమంత రూత్ ప్రభు మరియు నాగ చైతన్య విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘మా శ్రేయోభిలాషులందరికీ. చాలా చర్చలు, ఆలోచనల తరువాత చై, నేను మా స్వంత మార్గాలను అనుసరించడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఒక దశాబ్దానికి పైగా స్నేహంగా కలిసి ఉండటం మా అదృష్టం, ఇది మా మధ్య ఒక ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంటుందని మా నమ్మకం. ఈ కష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మాకు మద్దతివ్వాలని, మేము ముందుకు సాగడానికి…
స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత నిన్న తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా వీరి విడాకుల విషయమై సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే వాటిపై ఇన్నాళ్లూ స్పందించని సమంత, చై ఎట్టకేలకు విడాకుల విషయాన్నీ బయట పెట్టారు. అక్కినేని జంట విడిపోయినట్లు ప్రకటించిన వెంటనే, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ‘విడాకుల సంస్కృతి’, అది ఎలా పెరుగుతోంది అనే దానిపై వ్యాఖ్యానించింది. బాలీవుడ్ ‘విడాకుల…
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ గా పిలుచుకునే సమంత, నాగ చైతన్య నిన్న విడాకులు తీసుకున్నామని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. గాంధీ జయంతి రోజున తమ అభిమానులకు ఈ చేదు వార్తను చెప్పి నిరాశ పరిచారు. నాగార్జున సైతం తనకు ఇద్దరూ ఒక్కటేనని, విడాకుల విషయం వాళ్ళ పర్సనల్ అని, వాళ్లు ఇద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఒకవైపు అక్కినేని అభిమానులు చైతన్యను వదులుకున్నందుకు సమంత ఫ్యూచర్ లో బాధ పడాల్సి వస్తుందని అంటున్నారు. అయితే సమంత…
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్టు గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతుండగా.. ఎట్టకేలకు వీరిద్దరు స్పందించారు. విడాకులు తీసుకుంటున్నట్టు నాగచైతన్య, సమంత అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వీరి విడాకుల ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్న వేళా.. సమంత, నాగచైతన్య తమ డైవోర్స్ ను సెలెబ్రేట్ చేసుకోవాలంటూ కితమిచ్చాడు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ‘పెళ్లి అనే వాటిని మనం సెలెబ్రేట్ చేసుకోవద్దు.. పెళ్లంటే మంట.. అంటూ ఆర్జీవీ తన…
నాగచైతన్య- సమంతలు విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ ప్రకటనతో టాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయింది. నాగ చైతన్య – సమంత విడిపోవడంపై అక్కినేని నాగార్జున విచారం వ్యక్తం చేశారు. సమంత – నాగ చైతన్యలు విడిపోవడం దురదృష్టకరం అని, భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వారి వ్యక్తిగతం అని, ఇద్దరూ తనకెంతో దగ్గరివారని, సమంతతో తన కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైనదని, దేవుడు ఇద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని…
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని ఈ జంట.. తాజాగా సోషల్ మీడియా వేదికగా విడాకుల తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సమంత, తాను విడిపోతున్నట్లు హీరో నాగచైతన్య ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘పదేళ్ల పాటు స్నేహంగా ఉండి ఒక్కటయ్యాం. అభిమానులంతా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో స్నేహితులుగా కలిసి ఉంటాం. నాలుగేళ్ల వివాహబంధానికి తెరదించుతున్నాం’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక వీరిద్దరూ కలిసి…
చూడముచ్చటైన జంట అంటూ వేనోళ్ళ కీర్తించిన నాగచైతన్య, సమంత జంట విడాకులు తీసుకుంది. గత కొద్ది రోజులుగా చైతూ, సామ్ విడిపోతారని వినిపిస్తూనే ఉంది. అయితే శనివారం అధికారికంగా వారిద్దరూ విడిపోయినట్టు నాగచైతన్య తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నాడు. ఆ వెంటనే సమంత సైతం తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. టాలీవుడ్ ఓ స్టార్ జంట విడిపోవడం కొత్తేమీ కాదు. సినిమా జంటలు పెళ్ళయ్యాక బ్రేకప్ అయినవి కొన్ని అయితే, కొందరు వివాహ…