నాగచైతన్య నుండి విడాకులు తీసుకున్న తరువాత నటి సమంతపై సోషల్ మీడియాలో పలు కథలు, కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. వీటిపై సమంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
Read Also : “నో మోరల్స్” అంటూ సామ్ పోస్ట్… వాళ్ళ కోసమే!
అందులోని సారాంశం – “వ్యక్తిగతంగా నేను ఆందోళనలో ఉన్న సమయంలో మీరు చూపిన భావోద్వేగాలు, సానుభూతి కరిగించి వేశాయి. నాపై ప్రచారమైన తప్పుడు కథలు, కథనాలు ఎదుర్కోవడానికి నాకు మీ అభిమానం అండగా నిలచింది. అందుకు సర్వదా కృతజ్ఞురాలిని. నాకు ఇతరులతో అఫైర్స్ ఉన్నాయని, పిల్లలు వద్దన్నానని, నేనో అవకాశవాదినని, నాకు అబార్షన్స్ అయ్యాయని వాళ్ళు చెబుతున్నారు. విడాకులు అనేది బాధాకరమైన అంశం. ఈ బాధ నుండి కాలమే నాకు ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగా నాపై ఈ విధమైన ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఒట్టేసి చెబుతున్నా, ఇలాంటి వాటిని నేను అంగీకరించను. నన్ను బాధ పెట్టాలని ఇంకా ఏమి చేసినా ఊరుకోను”. సమంతను తమ మాటలతో సామాజిక మాధ్యమం వేదికగా వేధిస్తున్న వారిని ఆమె ఊరకే విడిచి పెట్టదని ఈ ట్వీట్ ద్వారా తేటతెల్లమవుతోంది. మరి ఇక ముందైనా సమంతపై వస్తున్న కథనాలకు బ్రేక్ పడుతుందేమో!?