సమంత, నాగ చైతన్య విడాకుల విషయం బహిరంగంగా వెల్లడించినప్పటి నుంచి పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఎక్కువగా విన్పిస్తుంది మాత్రం సామ్ పిల్లలు పుట్టడానికి నిరాకరించడమే కారణం అని. తన కెరీర్‌పై దృష్టి పెట్టడానికి సామ్ పిల్లలను ఇప్పుడే వద్దనుకుందని, ఆమె గర్భవతి అయినప్పుడు రెండుసార్లు అబార్షన్ చేయించుకుందని, తన ఫిగర్ పాడవకుండా సరోగెట్ ద్వారా బిడ్డను పొందాలని ఆమె అనుకున్నట్లు కొంతమంది అన్నారు. అయితే అవన్నీకేవలం పుకార్లని సమంత ప్రధాన పాత్రలో నటించిన “శాకుంతలం” చిత్ర నిర్మాత ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ మాట్లాడుతూ అసలు నిజం ఏంటో చెప్పుకొచ్చింది.
Read Also : మరో సినిమాలో నుంచి కాజల్ అవుట్
నీలిమ గుణ మాట్లాడుతూ“నా తండ్రి, దర్శకుడు గుణశేఖర్ గత సంవత్సరం ‘శాకుంతలం’ సినిమా కోసం సమంతను సంప్రదించారు. ఆమెకు కథ నచ్చింది. సినిమా విషయంలో చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు. కానీ ఈ సినిమాను ఒప్పుకునే ముందు ఆమె కాస్త భయపడింది. దానికి కారణం ఆ సమయంలో సామ్, నాగ చైతన్యతో ఒక కుటుంబాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తోంది. ఆ పిల్లలతోనే సమయాన్ని గడపాలని, సినిమాల నుంచి విరామం తీసుకుని వాళ్ళను చూసుకోవాలని అనుకుంది. ఇదే విషయాన్ని చెప్పి సాధారణంగా పీరియాడికల్ మూవీస్ అంటే షూటింగ్ పూర్తి చేయడానికి చాలా రోజులు పడుతుంది. అదే కాస్త ఆందోళనగా ఉందని చెప్పింది. జూలై లేదా ఆగస్టు నాటికి ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేయాలని చెప్పింది. ఆమె తల్లి కావాలని కోరుకుంది. తల్లి కావడానికే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని సామ్ మాకు చెప్పింది. అందుకే మేము సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి షూటింగ్ ను కూడా త్వరగానే పూర్తి చేస్తామని హామీ ఇచ్చాము. ఇది విన్న వెంటనే ఆమె సంతోషంగా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే మేము ఎలాంటి ఆటంకం కలగకుండా చాలా త్వరగా ‘శాకుంతలం’ను పూర్తి చేశాము”అని నీలిమా చెప్పింది.