సమంత, నాగ చైతన్య అక్టోబర్ 2న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సరిదిద్దలేని విభేదాల కారణంగా ఈ జంట తమ వివాహ వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు, నాలుగు సంవత్సరాల బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. గత వారం రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతూనే ఉంది. సమంత నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుండి ఆమె అభిమానుల నుండి విపరీతమైన సామ్ కు మంచి సపోర్ట్ లభిస్తోంది. కానీ కొందరు మాత్రం విడాకుల విషయంలో సమంతను ట్రోల్ చేస్తూ ఆమెపై నిందలు వేస్తున్నారు. తాజాగా అలాంటి వారికోసమే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ట్రోలర్స్ కు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది సామ్.
Read Also : శంకర్ పల్లిలో అల్లు అర్జున్ ఆస్తి కొనుగోలు
ఈ మేరకు రచయిత ఫరీదా రాసిన ఒక కోట్‌ని సామ్ పంచుకుంది. అందులో “ఏదైనా ఒక పనిని మహిళలు చేస్తే ప్రశ్నిస్తారు. కానీ అదే పనిని పురుషులు చేసినప్పుడు నైతికంగా ప్రశ్నించకపోతే సమాజంగా మనకు ప్రాథమిక విలువలు లేనట్టే” అని ఉంది. ఆమె “గుడ్ మార్నింగ్” మెసేజ్ తో ఈ కోట్‌ను పంచుకుంది. మరి ఇప్పటికైనా ట్రోలర్ల నోటికి తాళం పడుతుందేమో చూడాలి.