టాలీవుడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు గురించి చెప్పాలంటే.. అందం, అభినయం, క్యూట్‌నెస్ అన్నీ కలగలిపిన ప్యాకేజ్ అని చెప్పాలి. తన కెరీర్ ప్రారంభం నుంచి వరుస బ్లాక్‌బస్టర్లతో టాప్ స్టార్‌గా ఎదిగిన సమంత, ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అయితే, ఆమె జీవితంలో అనుకోని మలుపు తెచ్చింది ఆరోగ్య సమస్య. మయోసిటిస్ అనే వ్యాధి కారణంగా కొంత కాలం సినిమాలకు దూరమై, తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టింది. ఇప్పుడు మెల్లగా మళ్లీ పబ్లిక్ ఈవెంట్స్‌లో…
సక్సెస్ కోసం పరిగెత్తిన రోజులు.. బాక్సాఫీసు నంబర్ల కోసం ఆందోళన పడిన రాత్రులు.. ఇవన్నీ ఒక క్షణంలో తలకిందులయ్యాయి అంటున్నారు సమంత. విజయం, ఖ్యాతి, డబ్బు అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే జీవితం అసంపూర్ణం. మయోసైటిస్ వ్యాధితో పోరాడిన తర్వాత ఆమె జీవితం, ఆలోచనలు, ప్రాధాన్యతలు అన్నీ మారిపోయాయి. గతంలో విజయాలు అనుకున్నప్పటికీ, ఇప్పుడు జీవితాన్ని చూసే దృక్పథం మారిపోయిందని ఆమె వెల్లడించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత, తన అనుభవాలను పంచుకున్నారు.…
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్యూట్ గర్ల్ ఇమేజ్‌తో మొదలై, నేడు పాన్-ఇండియా లెవెల్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. తెలుగు, తమిళ భాషల్లో వరుస హిట్ సినిమాలు అందిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె, ఎమోషనల్ రోల్స్, లవ్ స్టోరీస్, యాక్షన్ డ్రామాల వరకు విభిన్నమైన పాత్రలో నటించి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. కేవలం నటనలోనే కాదు, ఫ్యాషన్ స్టైల్‌లోనూ, సోషల్ మీడియా యాక్టివిటీలోనూ సమంత ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. ఇందులో…
టాలివుడ్ స్టార్ హీరో సమంత గత కొన్ని నెలలుగా మయోసైటీస్‌తో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. యశోద మూవీ సందర్భంలో ఆమె ఈ విషయాన్ని పంచుకుంది. అంతేకాదు ఆమె దీనికి ట్రీట్‌మ్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఆమె స్టెరాయిడ్స్‌ను ఎక్కువగా వాడేవారట. ఈ క్రమంలో ఆమె ముఖంలో గ్లో తగ్గిందని తెలుస్తోంది.. ఈ విషయాన్ని సామ్ స్వయంగా చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ ఈ వ్యాధి నుంచి త్వరగా బయటపడాలని కోరుకున్నారు.. ఈ వ్యాధి నుంచి…
Samantha: సమంత.. సమంత.. సమంత.. ఎక్కడ విన్నా సామ్ పేరు మారుమ్రోగిపోతుంది. లైమ్ లైట్ లో ఉన్నా.. డిమ్ లైట్ కు వెళ్లినా సామ్ సోషల్ మీడియా సెన్సేషన్. ఆమె గురించి ఏ వార్త వచ్చినా ఇట్టే వైరల్ గా మారుతోంది. ఇక గత కొన్నిరోజులుగా సామ్ మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న విషయం తెల్సిందే.
సమంత స్వల్ప అనారోగ్యానికి గురైంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిన్న కడప పర్యటన తర్వాత సమంత అస్వస్థతకు గురై ఆసుపత్రికి వెళ్లారని సర్వత్రా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కడపలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన ఆమె, అమీన్ పీర్ దర్గాతో పాటు తిరుమల పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించారు. అప్పటి నుంచి ఆమెకు ఆరోగ్యం బాగోలేదని, ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.…