సమంత స్వల్ప అనారోగ్యానికి గురైంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిన్న కడప పర్యటన తర్వాత సమంత అస్వస్థతకు గురై ఆసుపత్రికి వెళ్లారని సర్వత్రా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కడపలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన ఆమె, అమీన్ పీర్ దర్గాతో పాటు తిరుమల పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించారు. అప్పటి నుంచి ఆమెకు ఆరోగ్యం బాగోలేదని, ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. “సమంత ఆరోగ్యంగా ఉన్నారు. నిన్న కాస్తంత దగ్గు రావడంతో ఏఐజీ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకున్న ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. ఎలాంటి వదంతులు నమ్మవద్దు” అని తెలిపారు.
Read Also : కరీనా కపూర్ కు కరోనా పాజిటివ్
గత వారం రోజులుగా విపరీతమైన వర్క్ షెడ్యూల్ తర్వాత సామ్ కు సాధారణ దగ్గు వచ్చిందని, ఆమె పరీక్షలు చేయించుకోవడానికి AIG ఆసుపత్రికి వెళ్లారు. కానీ, అక్కడ చేరలేదని అన్నారు. ప్రస్తుతం సామ్ తన గచ్చిబౌలి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కోవిడ్ భయాల మధ్య నటి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫోటోషూట్ వర్క్ పోస్ట్ చేసి దుబాయ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, సమంత మూడు రోజులు పని చేసిన ‘పుష్ప’ ఐటెమ్ సాంగ్ షూటింగ్‌ను కిక్‌స్టార్ట్ చేసింది.వెంటనే పూర్తి చేసింది. బహుశా పని ఒత్తిడి కారణంగా ఆమె స్వల్ప అస్వస్థతకు గురి అయ్యి ఉండొచ్చు.