టాలివుడ్ స్టార్ హీరో సమంత గత కొన్ని నెలలుగా మయోసైటీస్‌తో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. యశోద మూవీ సందర్భంలో ఆమె ఈ విషయాన్ని పంచుకుంది. అంతేకాదు ఆమె దీనికి ట్రీట్‌మ్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఆమె స్టెరాయిడ్స్‌ను ఎక్కువగా వాడేవారట. ఈ క్రమంలో ఆమె ముఖంలో గ్లో తగ్గిందని తెలుస్తోంది.. ఈ విషయాన్ని సామ్ స్వయంగా చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ ఈ వ్యాధి నుంచి త్వరగా బయటపడాలని కోరుకున్నారు..
ఈ వ్యాధి నుంచి కాస్త కోలుకున్న సమంత విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాను చేసింది.. ఆ సినిమా మిక్సీ్డ్ టాక్ అందుకున్న కలెక్షన్స్ పరంగా బాగానే వసూల్ చేసింది.. ఆ సినిమా తర్వాత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటున్నారు. అది అలా ఉంటే సమంత తాజాగా తన చేతికి డ్రిప్స్ ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె ఆసుపత్రి బెడ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను పంచుకుంటూ.. మందుల వల్ల తనకు కలిగే ప్రయోజనాల గురించి ఓ పోస్ట్ చేశారు. తనకు ఈ డ్రిప్సే తనకు కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తాయని తెలిపారు. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇక ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ మాత్రం సమంతకు ఏమై ఉంటుందని ఆందోళన చెందున్నారు.. సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. అది అలా ఉంటే సమంత త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏకంగా కండల వీరు సల్మాన్ ఖాన్ సరసన నటించనుందని టాక్ నడుస్తోంది.. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు..సమంత ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అయితే ఈ సిరీస్ కోసం మాత్రం ఓ రేంజ్‌లో అంటే పది కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.. ఇప్పటివరకు వెబ్ సిరీస్ కు ఇంత ఎవరు తీసుకోలేదని ఇండస్ట్రీలో టాక్..