నిప్పు లేనిదే పొగరాదని కొందరంటారు. కానీ మీడియా నిప్పులేకుండానే పొగను సృష్టిస్తుందని మరికొందరు వాపోతుంటారు. అయితే ఫిల్మ్ సెలబ్రిటీస్ చేసే కొన్ని పనులు చూస్తే… అవి నిప్పులేకుండానే పొగను సృష్టించడం కాదనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంజరంలో తాను ఉండలేని నర్మగర్భంగా ఓ మీడియా సంస్థకు సమంత చెప్పిందనే వార్తలు రావడంలో అందులో నిజం ఉందని చాలా మంది భావించారు. అయితే ఆ తర్వాత…
సమంత, నాగచైతన్య వివాహబంధం తెగిపోయినట్లేనా!? ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేసిన వార్త సమంత డైవోర్స్. అయితే దీని గురించి అటు సమంత కానీ, ఇటు అక్కినేని ఫ్యామిలీగానీ ఎక్కడా స్పందించలేదు. సమంత మాత్రం మీమ్స్ తో మీడియాను ఎండగట్టే ప్రయత్నం చేసింది. తమిళంలో చేస్తున్న సినిమా తప్ప వేరే ఏ కొత్త సినిమా కమిట్ అవలేదు సమంత. అంతే కాదు వ్యక్తిగత సిబ్బందికి సెలవులు ఇచ్చి తను కూడా టూర్స్ వేస్తోంది.…