పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. కంప్లీట్ బ్లాక్ థీమ్ తో, ఇండియాలోనే బిగ్గెస్ట్ మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందుతుంది సలార్ సినిమా. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి యాక్టర్స్ నటిస్తున్న ఈ మూవీలో ‘శృతి హాసన్’ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యాక్షన్ ఎపిక్ లో శృతి హాసన్ క్యారెక్టర్ కి ఈరోజు ఎండ్ కార్డ్ పడింది. ‘ఇట్స్ ఏ వ్రాప్ ఫర్ ఆద్య’ అంటూ మేకర్స్ అఫీషియల్ గా ట్వీట్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ తో పాటు మేకర్స్ ఒక ఫోటోని కూడా రిలీజ్ చేశారు, ఇందులో శృతిహాసన్, ప్రశాంత్ నీల్ తో పాటు డీఓపీ భువన్ కూడా ఉన్నాడు. హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఈ మూవీతో ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడని ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రభాస్ అభిమానులే కాదు ట్రేడ్ వర్గాలు కూడా సలార్ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుందని లెక్కలు వేస్తున్నారు. ప్రశాంత్ నీల్ KGF తర్వాత చేస్తున్న సినిమా కావడం, ప్రభాస్ చాలా రోజుల తర్వాత చేస్తున్న కంప్లీట్ యాక్షన్ మూవీ అవ్వడంతో సలార్ సినిమాపై ఆ రేంజ్ అంచనాలు ఉన్నాయి. మరి సెప్టెంబర్ 28న ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
It's a wrap for Aadya, @shrutihaasan ♥️#Salaar #Prabhas #PrashanthNeel #VijayKiragandur @hombalefilms @PrithviOfficial @IamJagguBhai @bhuvangowda84 @RaviBasrur @anbariv @shivakumarart @SalaarTheSaga pic.twitter.com/7OuVleZ02F
— Salaar (@SalaarTheSaga) February 23, 2023