Prabhas: పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారాడు. గతేడాది పెద్దనాన్న కృష్ణంరాజు మృతి తరువాత ప్రభాస్ నిమిషం కూడా ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకున్నాడో ఏమో.. వరుస సినిమాలతో కొంచెం కూడా గ్యాప్ లేకుండా షూటింగ్స్ తోనే బిజీగా మారాడు. ఒకపక్క సలార్, ఇంకోపక్క ప్రాజెక్ట్ కె.. మధ్యమధ్యలో మారుతి సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు.అయితే అందుతున్న సమాచారం ప్రకారం కొద్దిరోజుల క్రితం ప్రభాస్ విదేశాలకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. సలార్ షూటింగ్ కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. కానీ, ప్రభాస్ విదేశాలకు వెళ్ళింది సలార్ షూటింగ్ కొద్సం కాదట.. ఆయన రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే వెళ్లినట్లో ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
Nandamuri Sisters: నందమూరి ఆడపడుచులను ఇలా ఎప్పుడైనా చూశారా..?
కొన్నేళ్లుగా ప్రభాస్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. గతేడాది ప్రభాస్ కు మోకాలి సర్జరీ కూడా జరిగిందని రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం ఎంత అనేది ఇప్పటికీ తెలియదు. కానీ, ఈ హెల్త్ చెకప్ ఆ సర్జరీకి సంబంధించింది కాదట. ఎప్పుడూ చేయించుకొనే రెగ్యులర్ చెకప్ మాత్రమే అని సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో ప్రభాస్ ఇండియాలో అడుగుపెట్టనున్నారు. ఆ తరువాత ఎప్పటిలానే షూటింగ్ కు మొదలుపెట్టనున్నాడట. ఇక ఈ విషయం తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఆయనకు ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మాములు హెల్త్ చెకప్ కోసమే ప్రభాస్ వెళ్లినట్లు తెలియడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి ప్రభాస్ ఈ పాన్ ఇండియా సినిమాలతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.