సినిమా టికెట్ల ఆన్‌లైన్ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది.. ఆ తర్వాత ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. పోసాని కృష్ణ మురళి కూడా ఘాటుగా స్పందించాడు.. వీటి అన్నింటికీ కలిపే అదేస్థాయిలో మళ్లీ కౌంటర్ ఎటాక్ చేశారు పవన్.. అయితే, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడి నేను ఆ స్థాయి దిగజారదలుచుకోలేదంటూ కామెంట్ చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…
సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయం విషయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.. ఈ నేపథ్యంలో పవన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఒళ్లంతా బురద చల్లుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. తమ పాలిట గుదిబండ అయ్యారని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ పవన్ కల్యాణ్ గురించి…
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ… ప్రపంచ చరిత్రలో మానవత్వం ఉండే నాయకుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరు అని తెలిపారు. చరిత్ర పుటల్లో స్వర్ణక్షరాలతో రాయదగిన వ్యక్తి వైఎస్సార్. సమాజం మీద ప్రేమను చాటడమే కాకుండా కేవలం 5 ఏళ్ళల్లో ప్రజల జీవితాల్లో ఎంత ముద్ర వేయవచ్చో నిరూపించిన వ్యక్తి అని తెలిపారు. ఆయన నాటిన మొక్కే ఇవాళ జగన్ మహా వృక్షం అయి మన ముందు ఉన్నారు. తండ్రికి తగిన తనయుడు.…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది.. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాను 50:50 శాతంగా పంచాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ సర్కార్.. అయితే, తెలంగాణ కోరుతున్న 50:50 శాతం నీటి కేటాయింపులు పగటి కలే అని వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. కేఆర్‌ఎంబీకి లేఖ రాసినట్లు 70:30 శాతం నీటి కేటాయింపులు గతంలోనే చేశారన్న ఆయన.. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు చేసుకున్న…
అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది… ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అమర రాజా ఫ్యాక్టరీని వెళ్లిపొమ్మని మేం చెప్పలేదన్నారు.. తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు, కాలుష్య నియంత్రణ మండలి లేవనెత్తిన అభ్యంతరాలను సరి చేసుకుని అమర రాజా ఫ్యాక్టరీ ఇక్కడే కొనసాగవచ్చు అన్నారు.. ఇక, పరిశ్రమలు తరలిపోవాలని మేం కోరుకోం అని స్పష్టం చేశారు.…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ దాదాగిరి చేస్తుందంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అయితే, ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ కౌంటర్ ఎటాక్‌కు దిగారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు అన్నారు.. ఇక, దాదాగిరి ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్న సజ్జల… కేంద్ర జలశక్తి శాఖ…
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రాజీనామాల వ్యవహారం తెరపైకి వచ్చింది.. రాజీనామాలు చేసేందుకు మేం సిద్ధం.. వైసీపీ ఎంపీలు సిద్ధమా? అంటూ టీడీపీ ఎంపీలు సవాల్ చేస్తున్నారు.. దీనిపై సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… చంద్రబాబు, తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటే ఎవరు అడ్డుకుంటారు..? మమ్మల్ని అడగటం ఎందుకు ? అని ప్రశ్నించారు సజ్జల.. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేసినప్పుడు టీడీపీ వాళ్ళను అడిగామా? అని నిలదీసిన ఆయన.. ఇక, టీడీపీ…
నామినేటెడ్ పోస్టులు ఇవాళ ప్రకటించాల్సి ఉన్నా… రేపటికి వాయిదా పడింది… అయితే, కసరత్తు పూర్తి కాకపోవడంతో.. పోస్టుల ప్రకటన వాయిదా వేశామని.. రేపు ఉదయం వెల్లడిస్తామని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి… నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సి ఉందన్న ఆయన.. మహిళలకు కూడా 50 శాతం పదవులు ఇస్తున్నాం.. కసరత్తులో కొంత అలస్యం అయ్యిందన్నారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సజ్జల.. పార్టీకోసం ముందు నుంచి పని చేస్తున్న వారు, సామాజిక న్యాయం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్…
అమరావతి : తెలంగాణ ప్రభుత్వంలో జైళ్ళశాఖ సూపరెండెంట్ గా ఉన్న దశరథరామిరెడ్డిని ప్రభుత్వ సలహదారు సజ్జలకు ఓఎస్డి గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డిప్యూటేషన్ పై ఇక్కడ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఏపిలో నియమించేందుకు ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ కు అంగీకరించాలని కోరింది ఏపీ ప్రభుత్వం. దీనిపై స్పందించిన తెలంగాణ సర్కార్.. రెండు సంవత్సరాల డిప్యూటేషన్ కు అంగీకరించింది. దశరథరామిరెడ్డికి ఎలాంటి టిఏ డిఏలు వర్తించవని ఆయన విజ్జప్తి మేరకే…
సీఎం జగన్ తండ్రినిమించిన తనయుడు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి సుచరిత, మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని…రెండు రోజులలో ఐదు లక్షల ఇళ్లకు శంఖుస్థాపన జరిగిందన్నారు. read also :…