అమరావతి : తెలంగాణ ప్రభుత్వంలో జైళ్ళశాఖ సూపరెండెంట్ గా ఉన్న దశరథరామిరెడ్డిని ప్రభుత్వ సలహదారు సజ్జలకు ఓఎస్డి గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డిప్యూటేషన్ పై ఇక్కడ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఏపిలో నియమించేందుకు ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ కు అంగీకరించాలని కోరింది ఏపీ ప్రభుత్వం. దీనిపై స్పందించిన తెలంగాణ సర్కార్.. రెండు సంవత్సరాల డిప్యూటేషన్ కు అంగీకరించింది. దశరథరామిరెడ్డికి ఎలాంటి టిఏ డిఏలు వర్తించవని ఆయన విజ్జప్తి మేరకే ఈ నియామకం జరిగిందని ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక దీంతో రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.