ఏపీలో వైసీపీ కీలక నేతలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ పార్టీ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజ్యసభ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డికి రీజనల్, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు అనుబంధ సంఘాల కో ఆర్డినేషన్ బాధ్యతలను అప్పగించారు. గతంలోనే విజయసాయిరెడ్డి పార్టీ అనుబంధ సంఘాల కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యేలు,…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… మతి భ్రమించిన చంద్రబాబు.. నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారు.. అందుకే చంద్రబాబుకు తెలివి తేటలు, శక్తిసామర్థ్యాలు కావాలంట.. దుర్గమ్మవారిని అవే కోరుకున్నట్లు ఆయనే చెప్పారు.. మరి ఇన్నాళ్లూ అవి లేవా? ఉంటే వాటిని కోల్పోయారా..? అంటూ ఎద్దేవా చేశారు. మంచి మనసు, ఆలోచన ఉంటే అన్నీ బాగుంటాయి.. కానీ, చంద్రబాబుకు అవేవీ లేకుండా పోయాయన్న ఆయన.. చంద్రబాబు ఒక…
ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పాత మంత్రుల రాజీనామాలు శనివారం రాత్రి గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నాయి. నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. అయితే రాజీనామాల ఆమోదంపై మధ్యాహ్నానికి అధికారిక ప్రకటన వెలువడనుంది. దీంతో పాటు కొత్త మంత్రుల జాబితా తన వద్దకు రాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపనున్నారు. ఇదిలా ఉంటే… ఇప్పటికే కొత్త మంత్రుల లిస్ట్ కూడా ఫైనలైంది. కానీ పేర్లు మాత్రం అధికారికంగా…
మంత్రి వర్గం కూర్పు ఈ రోజు సాయంత్రానికి ఒక కొలిక్కి రానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా మంత్రి వర్గ సభ్యుల ఎంపిక పూర్తి చేశారంటున్నారు. ఈ రోజు మధ్యాహ్యం 12 గంటలకు మరోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ను కలవనున్నారు. ఈ రోజు సాయంత్రానికి తుది జాబితాను రూపొందించి రేపు ప్రమాణస్వీకారానికి రావాలని సజ్జల ప్రత్యేకంగా కొత్త మంత్రులను ఆహ్వానిస్తారని చెబుతున్నారు. అయితే 10 మంది పాతవారినే కొనసాగించనున్నట్లు…
ఏపీ సీఎం జగన్ కొత్త కేబినెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులంతా రాజీనామాలు చేసారు. కొత్త మంత్రి వర్గం ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనుంది. అందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ కొత్త మంత్రులు ఎవరు అన్న అంశంపై హాట్ హాట్ గా ఏపీ రాజకీయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈసారి కొత్త ముఖాలకు బాగానే చాన్సులు దొరికే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో…
ఏపీలో ఈనెల 11న సీఎం జగన్ కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. దీంతో చాలా మంది వైసీపీ నేతలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ మొత్తాన్ని సీఎం జగన్ చూస్తున్నారని సజ్జల తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ విస్తరణ ఉంటుందన్నారు. కేబినెట్‌లో మెజార్టీ మార్పులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సోషల్ జస్టిస్‌కు…
ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపును వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించుకున్నారు. తమ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో ఒకసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో హేతుబద్దంగా స్వల్పంగా మాత్రమే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామన్నారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీలు ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే తక్కువగా ఉన్నాయని సజ్జల అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటారనే నమ్మకం ఉందన్నారు. అయితే విద్యుత్…
YCP MLA Mekapti Chandrasekar Reddy Fired on YCP Leaders. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీలోని తన వ్యతిరేకులపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసి వైఎస్ఆర్‌సీపీలో కలకలం రేపారు. తన ఎమ్మెల్యే పదవి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో కొంతమంది తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారని, కానీ జగన్ టికెట్ ఇవ్వడంతో తాను గెలిచానని, అలాంటి వారందరికీ అధికారంలోకి వచ్చాక తాను మంచే చేశానని…
ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుందని వస్తున్న వార్తలపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ రెండున్నరేళ్లకు ఉంటుందని సీఎం జగన్ ముందే చెప్పారని, త్వరలోనే కెబినెట్ రీ-షఫుల్ ఉండే అవకాశం వుందన్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ మాకు కీలకమే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అవసరాన్ని బట్టి మంత్రులుగా ఉండే వాళ్ళను పార్టీకి వినియోగించుకుంటాం అన్నారు. చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నాడు. ముందస్తుకు…
విధాన పరమైన నిర్ణయాల అమల్లో సచివాలయ మహిళా ఉద్యోగులు క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమెన్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరి ప్రభుత్వం వచ్చినా.. ఆ నిర్ణయాలు అమల్లో మీదే కీలక పాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ గత మూడేళ్లగా మహిళా సాధికారికతకి కృషి చేస్తున్నారని, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం అనేక ఏళ్లుగా పోరాటం జరుగుతుందని, ఏపీలో 50 శాతానికి పైగా మహిళలకి…