టీడీపీ కార్యాలయంపై దాడి కేసును అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులను వేధిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు.
లుకౌట్ నోటీసులపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. విదేశాల నుంచి వస్తుంటే ఏపీ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారని అసత్య ప్రచారం చేస్తున్నారు.. తప్పు చేసి నేను తప్పించుకునే ప్రయత్నం చేశారని పైత్యంతో వార్తలు రాస్తున్నారని సజ్జల ఆరోపించారు.
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు లడ్డూపై దుర్మార్గపు వ్యాఖ్యలు చంద్రబాబు చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లడ్డూ కల్తీ జరిగిందని బలంగా ప్రచారం జరిపించారని అన్నారు. ఆ ర�
Sajjala: తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆరోపణలు చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారన్నారు.
మచిలీపట్నం వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని ఎన్నికల సంఘంపై అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తున్నాడంటూ టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఈసీ లేఖ రాశారు.
కౌంటింగ్‌పై పార్టీ శ్రేణులకు అవగాహన కలిగించటం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయం నుండి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. కౌంటింగ్‌లో అనుసరించాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తల ప�
ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. ట్రెండ్ అయితే క్లియర్ గా కనబడుతుందన్నారు. వైసీపీకి సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఉందని మా అంచనాగా పేర్కొన్న ఆయన.. ఎగ్జిట్ పోల్స్ కంటే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయని అనుకుంటున్నాం అన్నారు.
సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలి అనుకుంటున్నారు. ఈసీ, ఎన్డీయే కూటమి ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు అన్నారు. ప్రజా తీర్పు వైసీపీకి అనుకుంలాగా ఉంది.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళానికి గురి చేస్తున్నారు జాగ్రత్తగా చూడాలి అని సూచించారు.
కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అని పిలుపునిచ్చారు. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం.. జూన్ 9వ తేదీన ప్రమాణస్వీకారం ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.