Sajjala Ramakrishna Reddy: తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీసులో జరిగిన పార్టీ ఐటీ, సోషల్ మీడియా విభాగాల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు వర్క్‌షాప్‌లో కీలక సూచనలు చేశారు.. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీని బలమైన సంస్థాగత నిర్మాణంతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలి. పార్టీ కమిటీల నియామకాలన్నీ వెంటనే పూర్తిచేయడంలో అనుబంధ విభాగాలు అన్నీ ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు.. కమిటీల నియామకాలన్నీ డిజిటలైజేషన్ జరగాలి.. గ్రామ, వార్డు కమిటీలకు సంబంధించిన ప్రతి డేటా కూడా పకడ్బందీగా డిజిటలైజ్ చేయాలి.. డిజిటల్ మేనేజర్లతో పాటు ఐటీ, సోషల్ మీడియా విభాగాల నుంచి కూడా ఒక్కో విభాగం నుంచి 10 మంది చొప్పున ఇరవై మంది పూర్తి సమన్వయంతో పనిచేయాలి. 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం వెంటనే ప్రారంభం కావాలని ఆదేశించారు..
Read Also: Scam : మాజీ ఐపీఎస్ భార్యకు WhatsApp మెసేజ్… తర్వాత జరిగినది షాకింగ్!
ఇక, వచ్చే నెల 15వ తేదీ నాటికి పూర్తి డేటాతో ఆన్‌లైన్ పోర్టల్ సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు సజ్జల.. ఇవన్నీ పూర్తవగానే పార్టీ కేడర్‌కు ఐడీ కార్డులు అందజేసే ప్రక్రియను ప్రారంభించవచ్చు అన్నారు.. ఇప్పటికే మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమిటీల నియామకంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు.. అయితే, నిర్ధేశించిన కాలపరిమితిలోగా మనం కమిటీలన్నీ పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయగలిగితే పార్టీ మరింత పటిష్టంగా తయారవుతుంది అన్నారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి..