Sajjala Ramakrishna Reddy: సర్కార్‌పై సజ్జల ఫైర్.. ప్రభుత్వానికి అర్థమే మారిపోయింది..!
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి..
- ప్రభుత్వానికి అర్థమే మారిపోయిందన్న సజ్జల..
- ప్రజల ఆకాంక్షల మేరకు ఏ ప్రభుత్వాలు అయినా పనిచేస్తాయి..
- వ్యవస్థలకు అనుగుణంగా పనిచేయాలి..
- కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం వ్యవస్థలను గాలికి వదిలేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి అర్థమే మారిపోయింది అని ఆరోపించారు వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రజల ఆకాంక్షల మేరకు ఏ ప్రభుత్వాలు అయినా పనిచేస్తాయి.. మానిఫెస్టోలు అమలు చేయటంతో పాటు వ్యవస్థలకు అనుగుణంగా పనిచేయాలి.. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం వ్యవస్థలను గాలికి వదిలేసింది.. ప్రభుత్వమే నేరస్వభావం కలిగి ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు లేవు.. ప్రభుత్వం లోని పెద్దలే ఆర్గనైజ్డ్ క్రైమ్ కు పాల్పడుతున్నారు.. శాంతిభద్రతల పరిరక్షణ విషయం డొల్లగా మారిపోయింది.. చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృత రూపంలోకి వెళ్ళిపోయింది.. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ తో వీరి వికృత చేష్టలు పీక్ స్టేజ్ కు వెళ్లాయి.. అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని చూపించిన వ్యక్తిపై కేసులు పెట్టారు అంటూ మండిపడ్డారు..
Read Also: Paresh Rawal : ఆస్కార్ అవార్డుల్లో లాబీయింగ్ ఉంది.. స్టార్ యాక్టర్ కామెంట్స్
Also Read
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
నకిలీ మద్యం తయారు చేసి అమ్మే బ్యాచ్ ని పట్టుకున్నారు.. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర తర్వాత కూడా మా నేతలపై నెపాన్ని వేయటం శోచనీయం అన్నారు సజ్జల.. టీడీపీ నేత జయచంద్రారెడ్డి ప్రత్యక్ష ప్రమేయంపై సాక్ష్యాధారాలు ఉన్నాయి.. టీడీపీ వాళ్ల పాత్ర క్లియర్ గా కనిపిస్తున్నా తిరిగి వైసీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాపై అనేక ఆధార రహిత ఆరోపణలు చేశారు.. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారు.. లడ్డూ కల్తీ అంటూ దాన్ని వివాదం చేశారు.. టీడీపీ గ్రూపుల్లో గొడవలతో జంట హత్యలు జరిగినా మా పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కేసులు పెట్టారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు..
సోషల్ మీడియా కేసులో గంజాయి పెట్టి అక్రమ అరెస్టులు చేయటంతో హైకోర్టు కూడా ముట్టికాయలు వేసిందన్నారు సజ్జల.. తుని మైనర్ బాలికపై టీడీపీ నేత అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు అన్నారు.. ఆ కేసుతో సంబంధం లేకపోయినా వైసీపీ కార్యకర్తలను స్టేషన్ కి పిలిచి ఇబ్బందులు పెడుతున్నారు.. తప్పు జరిగిన చోట యాక్షన్ తీసుకోకుండా సంబంధం లేని చోట మా పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు.. నకిలీ మద్యం తయారు చేసింది టీడీపీ నేతలు అని అన్నీ ఆధారాలు ఉన్నాయి.. అయినా అసంబద్ధంగా జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు.. కేసు కోర్టుల్లో నిలిచినా.. లేకపోయినా కొన్నాళ్లు వైసీపీ వాళ్లను జైళ్లలో పెట్టొచ్చని ఆరాట పడుతున్నారు. జయచంద్రారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారని అందరికీ తెలుసు.. ఆయన మనుషులే నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడిపి వాళ్ల షాపుల్లోనే అమ్మకాలు జరిగాయని ఆధారాలు ఉన్నాయి.. జయచంద్రారెడ్డి, జనార్ధన్ ఇద్దరికీ ఆఫ్రికాలో వ్యాపారాలు ఉన్నాయి.. ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా జయచంద్రారెడ్డి తనకు ఆఫ్రికాలో వ్యాపారాలు ఉన్నాయని స్పష్టంగా ఇచ్చారని తెలిపారు..
రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా ఉందని చంద్రబాబు ఒప్పుకున్నారు.. కట్టుదిట్టం చేస్తామని చెప్పారే కానీ పట్టించుకోలేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మద్యం షాపులు పొందిన టీడీపీ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది.. జోగి రమేష్ అరెస్ట్ వ్యవహారం అసలు నియంతల పాలనలో కూడా ఉండదు అన్నారు. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ పాలనలో వ్యవస్థలు నీరుగారిపోతున్నాయి.. తమ స్వప్రయోజనాల కోసం ప్రత్యర్ధుల గొంతుక వినిపించకూడదు అని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు.. గతంలో లేని విధంగా లోకేష్ నేతృత్వంలో విధ్వంసపాలన జరుగుతుంది.. కేవలం వాంగ్మూలాల ఆధారంగా తమకు ఇష్టం వచ్చినవారిని ఇష్టం వచ్చినన్ని రోజులు జైళ్లో ఉంచుతున్నారు.. ఒక్కొక్క ఇష్యూను డైవర్ట్ చేయటానికి ఒక్కొక్క వైసీపీ నేతను టార్గెట్ చేసి అరెస్టులు చేశారు.. ఎవరి మీద కోపం ఉంటే వాళ్ల అరెస్టులు కొనసాగుతున్నాయి.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు నారా వారి కొత్త చట్టంలా మారింది.. జోగి రమేష్ ఇంట్లో పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు దొరికాయని చెప్తున్నారు.. చట్టాన్ని పూర్తిగా మిస్ యూజ్ చేస్తున్నారు.. నేరం చేయకున్నా శిక్షకు గురవుతున్నారు.. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో నకిలీ మద్యం నడుస్తూనే ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..