YSRCP: ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలతో సజ్జల, బొత్స అత్యవసర భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ నేతలతో పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ అత్యవసరంగా భేటీ అయ్యారు.. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులు, శాంతిభద్రతల పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై పార్టీ ఎలా స్పందించాలనే అంశంపై నేతలతో సజ్జల, బొత్స అభిప్రాయాలు పంచుకున్నారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
అలాగే తిరుమల ప్రతిష్టను దిగజార్చే విధంగా జరుగుతున్న చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ నేతలు… ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని, ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఆగడాలను నిలువరించాల్సిన అవసరం ఉందని నేతలు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ప్రజల్లోకి బలంగా వెళ్లి వాస్తవాలను వివరించడంతో పాటు పార్టీ నేతలకు భద్రత కల్పించేలా పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. కాగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్.. ఆ తర్వాత.. అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులు.. వారిపై కేసులు.. ఇలా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కొనసాగుతోన్న విషయం విదితమే..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!