Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి సంచలనంగా మారింది. ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన దుండగుడు కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. మెడపై, వెన్నుముకపై బలమైన గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సైఫ్ ప్రమాదం నుంచి బయటపడినట్లు వెల్లడించారు.
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దుండుగుడి దాడి యావత్ సినీ పరిశ్రమని షాక్‌కి గురిచేసింది. గురువారం తెల్లవారుజామున సైఫ్ ఇంటిలోకి ప్రవేశించిన దుండుగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. నటుడి ఒంటిపై మొత్త ఆరు కత్తిపోట్లు ఉన్నాయి. మెడపై , వెన్నుముకలో తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ సమయంలో సైప్ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రిని వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించారు.