Muhammad Yunus: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. న్యూయార్క్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. గతేడాది బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనను, షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడాన్ని భారత్ ఇష్టపడలేదని ఆయన అన్నారు.
BAN vs IND: ఒమన్‌లోని మస్కట్‌లో జరిగిన 8వ హిందూ మహాసముద్ర సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్- పాకిస్తాన్ మధ్య వివాదంతో చాలా కాలంగా సార్క్ పునరుద్ధరణపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
Pakistan-Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా గద్దె దిగినప్పటి నుంచి ఆ దేశం పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. అక్కడ ఇస్లామిక్ రాడికల్ గ్రూపులు పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు పెంచుకోవాలని చెబుతున్నాయి. దీనికి తగ్గట్లుగానే మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్‌తో తెగ చర్చలు జరుపుతోంది.
ఒక సభ్యుడు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నంత కాలం భారతదేశం సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) సమావేశాన్ని నిర్వహించలేమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం తెలిపారు. రాత్రిపూట ఉగ్రవాదం, పగటిపూట వ్యాపారం జరిగే పరిస్థితిని భారతదేశం సహించదని పాకిస్థాన్‌పై జైశంకర్ మండిపడ్డారు.
ఈరోజు నుంచి న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు అన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. కాగా, ఈ సదస్సు జరిగే సమయంలోనే సార్క్ దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులు సమావేశం కావాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆఫ్గనిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి తాలిబన్లను కూడా పిలవాలని పాక్ కొత్త మెలిక పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న ప్రస్తుత…