Tollywood: ఓటీటీల కారణంగా సినిమా థియేటర్ కు ప్రేక్షకులు రావడం లేదని నిర్మాతలు ఆ మధ్య గగ్గోలు పెట్టారు. దాంతో సినిమా విడుదలైన వెంటనే ఓటీటీలకు ఇవ్వకూడదని కనీసం మూడ, నాలుగు వారాల గ్యాప్ తో చిన్న సినిమాలను, యాభై రోజులు దాటిన తర్వాతే పెద్ద సినిమాలను స్ట్రీమింగ్ కు ఇవ్వాలని నిర్మాత మండలి సలహా ఇచ్చింది.