రెజీనా, నివేదా థామస్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా ‘శాకిని – డాకిని’. శాలిని, దామిని అనే ఇద్దరు అమ్మాయిల కథ. మరి అలాంటి అందమైన అమ్మాయిలు ‘శాకిని – డాకిని’గా ఎలా మారిపోయారన్నది సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సింది. ఇందులో డబుల్ ఫన్, డబుల్ యాక్షన్ ఉంటుందని దర్శక నిర్మాతలు విడుదలకు ముందే హామీ ఇచ్చేస్తూ, ఈ మూవీని సెప్టెంబర్ 16న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రెండో చిత్రంగా సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ సంస్థలు ‘శాకిని డాకిని’ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాయి. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ‘మిస్ గ్రానీ’ సినిమా యూనివర్సల్ కథ కావడంతో ‘ఓ బేబీ’గా రీమేక్ చేశారు. అది చక్కని విజయాన్ని అందుకుంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ‘మిడ్ నైట్ రన్నర్స్’ కథకూ గ్లోబల్ అప్పిల్ ఉండటంతో దీనిని ‘శాకిని – డాకిని’గా తీస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఇది తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే కథ అని చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ కాగా, మిక్కీ మెల్క్రెరీ సంగీతాన్ని అందిస్తున్నారు.
విశేషం ఏమంటే.. సెప్టెంబర్ 15వ తేదీ విశాల్ ‘లాఠీ’ మూవీ విడుదల కాబోతోంది. అలానే 16వ తేదీ ఇప్పటికే ఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’ మూవీతో పాటు సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రం కూడా రిలీజ్ అవుతోంది.