“వింటే భారతం వినాలి… తింటే గారెలే తినాలి…” అని నానుడి. రామాయణ, భారత, భాగవతాలు మన భారతీయులకు పవిత్రగ్రంథాలు. ఈ పురాణగాథల ఆధారంగానే భారతీయ సినిమా, తెలుగు సినిమా ప్రాణం పోసుకోవడం విశేషం! తరువాతి రోజుల్లో భారతీయ పురాణగాథలను తెరకెక్కించడంలో తెలుగువారు మేటి అనిపించుకున్నారు. అందులో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి.రామారావు నటించిన పౌరాణిక చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. తెలుగులో రూపొందిన యన్టీఆర్ పౌరాణికాలు ఇతర భాషల్లోకి అనువాదమై అలరించాయి. భారతగాథకు అసలైన నాయకుడు అనిపించే భీష్ముని గాథతో…