S-400: పాకిస్తాన్, చైనా దేశాలకు చేదు వార్త. భారత్ రక్షణ దళాలు రష్యాకు బయలుదేరాయి. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో ఒకటైన S-400 వైమానిక రక్షణ వ్యవస్థలపై అధునాతన శిక్షణ తీసుకోవడానికి మన సైనికులు పెద్ద సంఖ్యలో రష్యాకు వెళ్లారు.
S-500: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ అద్భుతం సృష్టించింది. స్వదేశీ టెక్నాలజీకి తోడుగా విదేశీ టెక్నాలజీ తోడైతే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది మనం చూస్తున్నాం. పాకిస్తాన్ పంపిన డ్రోన్లను, క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నిర్వీర్యం చేశాయి. భారత్‌పై ఎన్ని సార్లు దాడికి ప్రయత్నించినా దాయాది దారుణంగా విఫలమైంది. ఆకాష్, ఎస్-400 సుదర్శన చక్ర, బ్రహ్మోస్ వంటి వ్యవస్థలు చాలా బాగా పనిచేశాయి.