Grama Sabhalu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 4 రోజుల పాటు గ్రామసభలు కొనసాగాయి. అయితే.. కొన్ని చోట్ల ఆందోళనల మధ్య గ్రామసభలు ముగిశాయి. తమ పేరు జాబితాలో లేదంటూ పలువురు నిరసన వ్యక్తం చేశారు.. అయితే.. ఈ నెల 26 నుంచి నాలుగు పథకాలు ప్రారంభం కానున్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే.. ఈ నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేస్తున్నారు. అర్హులైన వాళ్ల పేర్లు గ్రామసభల్లో చదివి వినిపించారు అధికారులు. అయితే.. అభ్యంతరాలు ఉంటే గ్రామసభల్లోనే స్వీకరించారు అధికారులు. నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 13,861 గ్రామ సభలు నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు. ఇది మొత్తం లక్ష్యంలోని 85.96 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అయితే.. నేటితో ముగిసిన గ్రామసభలతో ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Hamas-Israel: చనిపోయాడనుకున్న హమాస్ కమాండర్ ప్రత్యక్షం.. షాకైన ఐడీఎఫ్!