తెలంగాణలో గుంట భూమి ఉన్నా.. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను వర్తింపజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, రాష్ట్రంలోని 148 మంది రైతులకు రైతు బంధు ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది ఎక్సైజ్‌శాఖ.. గంజాయి పండిస్తున్న రైతులకు రైతు బంధు కట్ చేయాలని కోరింది.. గంజాయి పండిస్తున్న 148 మంది రైతులపై 121 కేసులు నమోదు అయినట్టు సీఎం దృష్టికి తీసుకెళ్లింది ఎక్సైజ్ శాఖ.. గంజాయి సాగు చేస్తున్న వీరికి రైతు బంధు నిలిపివేయాలని…
కేంద్రంపై మండిపడ్డారు మంత్రి తన్నీరు హరీష్ రావు. మిషన్ భగీరథను హర్ ఘర్ హల్ గా కాపీ కొట్టారని, రైతు బంధు లాంటి పథకంను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో తెచ్చారని విమర్శించారు. దళిత బంధు పథకంను దేశ వ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. దళితులపై కపట ప్రేమను ఒలకబోస్తుంది బీజేపీ. ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో దళిత బంధు పథకం ను ప్రవేశ పెట్టి…
మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఉంది. రకరకాల హోదాలు ఇచ్చి ప్రయోజకుడిని చేద్దాం అని కేసిఆర్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ తండ్రి వల్ల కావడం లేదు. కేటీఆర్ నిర్వహించిన ప్రతీ శాఖ దివాలా తీసింది. కేటీఆర్ నిన్న సవాల్ విసిరారు. నాలుగేండ్లు 50 వేల కోట్లు రైతు బంధు ఖాతాలలో వేశాం అన్నారు. కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా. రైతులకు…
తెలంగాణలో రైతు బంధు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. గులాబీ నేతలు తమ అధినేతపై అభిమానాన్ని వెరైటీగా చాటుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఓ ఎమ్మెల్యే కేసీఆర్ బొమ్మను వెరైటీగా తయారుచేయించారు. 200 క్వింటాల్ నవ ధాన్యాలతో కేసీఆర్ బొమ్మతో పాటు జై తెలంగాణ, రైతు బంధు నినాదాలతో రూపొందించారు. పంట పొలాల్లో కేసీఆర్ బొమ్మని వడ్లు బియ్యం ,మొలకలతో తయారుచేసి వెరైటీగా రైతు బంధు ఉత్సవాలను నిర్వహించారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. దీనిపై ఊరి పేరుతో పాటు జై…
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇతోధికంగా సాయం అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా నిధులు ఇస్తోంది. రైతుల ఆత్మ బంధువుగా చేపట్టిన రైతు బంధు పథకం విజయవంతంగా అమలు అవుతోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 63 లక్షల తెలంగాణ రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. దీంతో వ్యవసాయం కోసం అప్సులు తెచ్చుకునే బాధ చాలామటుకు తప్పుతోంది. తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఈ సంక్రాంతి వరకు జరుపుకోవాలని…
బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి అనుకున్నాం. బండి సంజయ్ కు …జేపీ నడ్డాకు పెద్ద తేడా లేదు. బీజేపీ అంటే భకవస్ జుమ్లా పార్టీ. యూపీలో బీజేపీ సర్కార్ చేసింది ఏమి లేదు…అంతా చిల్లర రాజకీయం. దేశంలో చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని బిజెపి ఆలోచనగా వుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వామ్య పక్షాలు ఎవరు అంటే బీజేపీ, ఈడీ,సీబీఐ, ఐటీలే అన్నారు. ఢిల్లీలో కొంత మీడియా…
వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు సంబరాలు చేయాలని నిర్ణయించారు. రైతు ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు చేరనున్న సందర్భంగా ఈ సంబరాలు నిర్వహించనున్నారు. జనవరి 3 నుంచి 10 తేదీ వరకు రైతుబంధు సంబరాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ నిబంధనలు, పరిమితులకు అనుగుణంగా చేయాలని ప్రభుత్వం సూచించింది. మేరకు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి టెలికాన్ఫరెన్స్…
రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… రైతుబంధు సొమ్మును రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది తెలంగాణ సర్కార్.. రేపటి నుంచి యాసంగి రైతుబంధు నిధులు పంపిణీ జరగనుంది.. ఈ పథకం ప్రారంభమయినప్పటి నుండి ఏడు విడతలలో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాలలోకి జమ అయ్యాయి.. ఈ సీజన్ తో కలుపుకుని మొత్తం రూ.50 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో జమ కానున్నాయి.. ఇక, డిసెంబర్ 10వ తేదీ నాటికి…
నా పైన మావోయిస్టు పార్టీ రాసింది నిజమైన లేఖ కాదు.. అది సృష్టించారు అని అన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అని సూచించారు. నేను రైతు బంధు వద్దు అని అనలేదు. ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి మాత్రమే వద్దన్నాను అని స్పష్టం చేసారు ఈటల. పోలీసులు చట్ట బద్దంగా పని చెయ్యాలి. బయటి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్ దిన్…
రైతులకు పంట పెట్టుబడి సాయానికి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారు సీఎం కేసీఆర్.. ప్రతీ పంటకు రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు.. ఈ నెల 15వ తేదీ నుంచి క్రమంగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తుండగా.. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా 60.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7360.41 కోట్లు జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు విడుదల అయ్యాయని.. మిగిలిపోయిన…