తెలంగాణలో రైతుల కళ్లలో సీఎం కేసీఆర్ సంతోషం చూస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు సంపూర్ణం అయిందని ఆయన పేర్కొన్నారు. 11వ విడతలో రూ.7624.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయని తెలిపారు.
ఖమ్మ జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి రైతులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతు బంధు ఇస్తున్నా.. అనే సాకు చూపించి అరకొర రైతుబంధు ఇచ్చి రైతులకు ఏదో మేలు చేస్తున్నాను అని చేప్తున్న కేసీఆర్ కి ఆకాల వర్షంతో నష్టపోయిన రైతుల కష్టాలు కనపడుతున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించారు.
Rythu Bandhu : రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త తీసుకొచ్చింది. నేడు వారి కోసం మరో రూ.550కోట్ల నిధులు విడుదల చేసింది. రైతు బంధు పథకంలో భాగంగా తెలంగాణ రైతులకు మంగళవారం మరో రూ.550.14 కోట్లు విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.