కొన్ని దేశాలు జనాభా పెరిగిపోతుందని ఆందోళన చెందుతుంటే.. మరికొన్ని దేశాలు జనాభా తగ్గిపోతుందని అప్రమత్తం అవుతున్నాయి.. జనాభా తగ్గిపోతుండటంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన చెందుతున్నాడు. అందుకే జనాభా పెంచేందుకు ఓ వినూత్న పథకాన్ని తీసుకొచ్చారు.. కొత్త స్కీమ్ ప్రకారం పది మంది పిల్లల్ని కనడం, వారిని బతికించగలిగితే.. ఆ తల్లులకు ఒకేసారి 13,500 పౌండ్లు అంటే.. భారత కరెన్సీ ప్రకారం రూ.13 లక్షల సాయం అందిస్తామని ప్రకటించారు.. “వీర మాతృమూర్తి” -“ఆదర్శ మాత” పథకాన్ని ప్రవేశపెట్టారు…