ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది… ఉక్రెయిన్ ప్రధాన నగరాలైన కీవ్, ఖర్వివ్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌పై గత 8 రోజులుగా రష్యా దాడులు చేస్తోంది. జనావాసాలను కూడా రాకెట్లు, క్షిపణులతో విధ్వంసం చేస్తోంది.. మరోవైపు రష్యా అణు జలాంతర్గాములను సిద్ధం చేస్తోంది. బారెంట్స్ జలాల్లోకి అణు జలాంతర్గాములను తరలిస్తోంది. ఇప్పటికే ఖెర్సాన్, బెర్డ్యాన్స్ ఓడరేవులను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఒడెస్సా, మరియూపూల్ స్వాధీనం చేసుకోవడానికి ముందుకు కదులుతోంది.. ఇక, యుద్ధంపై కీలక…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది… ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా కొన్ని దేశాలు నిలుస్తున్నాయి.. ఆయుధాలు, ఇతర సమాగ్రి సరఫరా చేస్తున్నాయి.. దీంతో.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందా? అనే చర్చ సాగుతోంది.. ఇదే సమయంలో రష్యా విదేశాంగవాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మూడో ప్రపంచ యుద్ధమే వస్తే అది అణ్వాయుధాలతోనే సాగుతుందని.. ఈ యుద్ధంతో పెను విధ్వంసం తప్పదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వ్యాఖ్యానించారు.. ఇక,…
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఏడో రోజుకు చేరుకుంది, ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా దేశంలోని ఇతర పెద్ద నగరాలపై దాడులను తీవ్రతరం చేశాయి రష్యా బలగాలు.. రాజధాని కీవ్ సిటీపై పట్టు సాధించేందుకు రష్యా ప్రయత్నం చేస్తోంది.. ఇతర నగరాలను హస్తగతం చేసుకుంటోంది. తాజాగా దక్షిణ ఉక్రెయిన్‌లోని అతిపెద్ద సిటీ అయిన ఖేర్సన్ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. రష్యా పాలమిలటరీ బలగాలు ఖేర్సన్లో బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఉక్రెయిన్ సైనికులతో పాటు, పౌరులు…
ఇప్పుడు ప్రపంచమంతటా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన స్టయిలే వేరంటున్నారు. పుతిన్ మాటలకు అర్థాలే వేరు?పుతిన్ యస్ అన్నాడంటే..అది నో….నో అన్నాడంటే అది పక్కా ఎస్. మాట ఒకటి…చేత ఇంకోటి. మొన్న క్రిమియాపై అదే బాట. ఆ తర్వాత డాన్ బాస్ పై అదే పాట. ఉక్రెయిన్ వార్ పై అదే తీరు. ఇప్పుడు లేటెస్టుగా ఆయన నోటి నుంచి జాలువారిన మరో డైలాగ్ బాంబ్, అణ్వస్త్ర సంసిద్ధత. మరి రష్యా అధ్యక్షుడి…
పిల్లి, ఎలుక కొట్టుకుంటుంటే మన పెద్దలు పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అని చెప్తుంటారు. ఇప్పుడు ఇదే మాటను మనం రష్యా, ఉక్రెయిన్ దేశాలకు అన్వయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా వార్ శ్రీలంకను మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకను చమురు ధరలు నిండా ముంచేశాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.200 దాటింది. మరోవైపు నిత్యావసరాల…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఇతర దేశాలపై పడుతోంది. ముఖ్యంగా విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖార్కివ్ నగరంలో జరిగిన రష్యా రాకెట్ దాడిలో భారతీయ విద్యార్ధి మరణించినట్టు తెలుస్తోంది. కర్నాటకకు చెందిన విద్యార్ధిగా భారత విదేశాంగ శాఖ తెలిపింది. మృతి చెందిన విద్యార్థి కుటుంబంతో మాట్లాడుతున్నామని చెప్పింది విదేశీ వ్యవహరాల శాఖ. విద్యార్ఘి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది విదేశీ వ్యవహరాల శాఖ. విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన అధికారి దీనిని ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. బెలారస్లో ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు చర్చలు జరుపుతున్నారు. ఇదిలా వుంటే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపకపోతే 70 లక్షల మంది వలస వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని ఉక్రెయిన్ పట్టుబడుతుండగా.. పలు ఒప్పందాలకు ఆమోదం తెలపాలని రష్యా డిమాండ్ చేస్తోంది. తమ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులు సహా ఇతర దేశస్తులు సురక్షితంగా దేశాన్ని విడిచి వెళ్లేలా సాయం…
ఉక్రెయిన్ లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయ విద్యార్ధులను, పౌరులను త్వరగా స్వదేశానికి తరలించాలని రాజ్యసభలో టీడీపీ నేత కనకమేడల రవీందర్ కుమార్ కేంద్రాన్ని కోరారు. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానలో ఢిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్దులను కలుసుకుని క్షేమసమాచారాలు తెలుసుకున్నారు ఎంపీ కనకమేడల. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులకు ఢిల్లీలో అన్నిరకాల సహాయాన్ని స్వయంగా దగ్గరుండి అందించాలని చంద్రబాబు ఆదేశించారు.అక్కడినుంచి వచ్చే విద్యార్థుల వెతలను, చేదు అనుభవాలను విదేశీ వ్యవహరాల మంత్రి దృష్టికి…
రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకోవాలని రష్యా భావిస్తుండగా.. ఉక్రెయిన్ సైన్యం, ప్రజల నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. మరోవైపు.. ఇప్పటికే తాము ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం అని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.. తాజాగా.. రష్యాతో చర్చలకు అంగీకారం తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. కాగా, బెలారస్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్నాయని రష్యన్ మీడియా మాస్కోలో ప్రకటించింది. చర్చల కోసం బెలారస్‌కు ఉక్రెయిన్ బృందం బయలుదేరింది.…
ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతుండటంతో ప్రజలు ఆ దేశం నుంచి ఎలాగోలా తప్పించుకొని బయటపడుతున్నారు. ఉక్రెయిన్‌కు సమీపంలో ఉన్న పోలెండ్ బోర్డర్‌కు చేరుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి పోలెండ్ బోర్డర్లోకి వచ్చే వారికి ఎలాంటి వీసాలు అవసరం లేదని, డైరెక్ట్‌గా రష్యా నుంచి ఉక్రెయిన్‌లోకి రావొచ్చని స్పష్టం అధికారులు స్పష్టం చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఉక్రెయిన్ నుంచి విద్యార్ధులు పోలెండ్ బోర్డర్‌కు చేరుకుంటున్నారు. అయితే, పోలెండ్ బోర్డ్ర్కు చేరుకున్న విద్యార్థులను అక్కడి బోర్డర్లో సైనికులు, పోలీసులు అడ్డుకుంటున్నారు. విదేశీ…