రష్యాలో చాలా కాలంగా నివసిస్తున్న ఓ అమెరికన్ డ్యాన్సర్‌ను దేశద్రోహం ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన ఓ సంస్థకు 51 డాలర్లు (దాదాపు 4 వేల రూపాయలు) విరాళంగా ఇచ్చినట్లు ఆ మహిళపై ఆరోపణలు వచ్చాయి.
రష్యా ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోరారు. దేశం యొక్క జాతి మనుగడ కోసం రష్యన్ కుటుంబాలు కనీసం ఇద్దరు పిల్లలను కలిగి ఉండాలన్నారు.
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. ఒకవేళ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో వెనక్కి తగ్గితే ఆయనను హతమార్చే ఛాన్స్ ఉందన్నారు.
ఫిబ్రవరి 7వ తేదీన ఉక్రెయిన్‌పై దాడి సమయంలో రష్యా హైపర్‌సోనిక్ జిర్కాన్ క్షిపణిని ప్రయోగించింది. కీవ్‌లోని శాస్త్రీయ పరిశోధనా సంస్థ ఫోరెన్సిక్ పరీక్షల అధిపతి సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతంపై భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రష్యా ఆధీనంలోని లిసిచాన్స్క్ సిటీలోని బేకరీపై ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యన్ అధికారులు తెలిపారు.
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య గత 23 నెలలుగా సాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. ఫిబ్రవరి 24కి ఈ యుద్ధం మొదలై రెండేళ్లు అవుతుంది. ఇన్ని రోజుల యుద్ధం తర్వాత కూడా ఎవరూ గెలవలేదు, ఓడిపోలేదు.
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకు 3 లక్షల 83 వేల మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారు. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు స్వయంగా ప్రకటించారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత పెంచేందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆరోపించారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణను ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి విస్తరించాలని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయని షోయిగు చెప్పారు.
Russia Ukraine War: పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఒక నగరంపై రష్యా గురువారం క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ఒక భవనంలో కనీసం ఐదుగురు మరణించారు. గతేడాది క్రెమ్లిన్ సైన్యం దేశంపై దాడి చేసినప్పటి నుండి ఎల్వివ్పై ఇది అత్యంత ఘోరమైన దాడి అని అధికారులు తెలిపారు.