Home
Russia Ukraine War
Russia Ukraine War News
-
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో అతిపెద్ద సంక్షోభం.. 10 రోజుల్లో 15 లక్షల మంది వలస
ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ అధికారులు వరుసబెట్టి దాడులు చేస్తుండటంతో ఉక్రెయిన్ ప్రజలు తమ దేశాన్ని విడిచి వలస వెళ్లిపోతున్నారు. రష్యా దాడులు ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు 15 లక్షల మంది వలస వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతోన్న వలస సంక్షోభం ఇదేనని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశమైన మాల్డోవాకు శరణార్థులు పోటెత్తుతున్నారు. గత 11 రోజుల వ్యవధిలో 2.30 లక్షల మంది మాల్డోవాలోకి… -
Edible Oil: మార్కెట్లో వంటనూనె కొరత.. బ్లాక్ చేసిన వ్యాపారులు
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం భారత్‌లోని సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వార్ కారణంగా ఇప్పటికే భారత్‌లో వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉన్న స్టాక్‌ను వ్యాపారులు బ్లాక్ చేసేస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్లో వంటనూనెలకు కొరత ఏర్పడుతోంది. ఒకవేళ వంటనూనెల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నా వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లోని డీమార్ట్ వంటి పెద్ద షాపింగ్ మాళ్లలో లిమిటెడ్‌గా వంటనూనెల ప్యాకెట్లను… -
Russia-Ukraine war: ఈ యుద్ధానికి ఏది ముగింపు?
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి పది రోజులైంది. పుతిన్ బలగాలను ఉక్రెయిన్ సైన్యం, పౌరులు కలిసికట్టుగా ఎదిరిస్తున్నారు. అయినా ప్రత్యర్థి దేశంలోని ఒక్కో నగరాన్ని, పట్టణాన్ని వ్యూహాత్మక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఇంకా అమెరికా, నాటోపై ఆశ చావలేదు. ఓ వైపు ఉక్రెయిన్‌లో యుద్ధ బీభత్సం సృష్టిస్తూనే రష్యా మరోపక్క చర్చలు జపం చేస్తోంది. రష్యా చర్యను ఇప్పటికే మెజార్టీ దేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఐక్యరాజ్య సమితి వేధికగా దాడిని… -
Russia-Ukraine conflict: భారీగా పెరగనున్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య రంగం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటనూనెలు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల త్వరలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. సెమీకండక్టర్ చిప్స్ తయారీలో కీలక ముడి వస్తువులుగా ఉన్న పల్లాడియం, నియాన్ ఎగుమతిలో ఉక్రెయిన్, రష్యాలే సింహా భాగాన్ని ఆక్రమించాయి. అంతేకాకుండా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న పల్లాడియంలో 44 శాతం ఒక్క… -
Ukraine Crisis : ఢిల్లీకి చేరుకున్న మరో 629 మంది విద్యార్థులు
ఉక్రెయిన్ పొరుగు దేశాల నుండి మరో 629 మంది భారతీయులను తీసుకువస్తున్న మూడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) విమానాలు శనివారం ఉదయం హిండన్ ఎయిర్ బేస్‌లో దిగినట్లు వైమానిక దళం తెలిపింది. రష్యా సైనిక దాడి కారణంగా ఫిబ్రవరి 24 నుండి ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడినందున, యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, స్లోవేకియా మరియు పోలాండ్ నుండి భారతదేశం తన పౌరులను ఖాళీ చేయిస్తోంది. “ఇప్పటి వరకు, భారత వైమానిక దళం… -
Russia Ukraine War: జెలెన్ స్కీ గురించి ఈ విషయాలు తెలుసా?
రెండే రెండు పేర్లు ఇప్పుడు ప్రపంచమంతా మార్మోగుతున్నాయి. ఒకటి పుతిన్.. రెండోది జెలెన్ స్కీ. రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి అందరికీ తెలుసు. రెండు దశాబ్దాలుగా ఆయన రష్యాను తిరుగులేకుండా పాలిస్తున్నారు. కానీ జెలెన్ స్కీ గురించే చాలా మందికి తెలియదు. నిజానికి, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగే వరకు ఆయన ఎవరో కూడా తెలియదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు కావటానికి ముందు జెలెన్స్కీ ఒక బిజీ నటుడు. పలు సినిమాలు టీవీ సిరీస్‌లలో హాస్య పాత్రలు పోషించారు.… -
Edible Oil: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన వంటనూనెల ధరలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశంలో వంట నూనెల సరఫరా భారీగా పడిపోయింది. సుమారు 80 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు పడిపోయాయి. జనవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 3,07,684 టన్నులు ఉండగా.. ఫిబ్రవరిలో 1,40,000 టన్నులకు పడిపోయాయి. జనవరిలో పోలిస్తే ఫిబ్రవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 22 శాతం పడిపోయాయి. దీంతో సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు భారీగా గిరాకీ ఏర్పడింది.… -
Russia Ukraine War: ఎల్ఐసీ ఐపీవో వాయిదా
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల కారణంగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతి పెద్ద ఐపీవోకు లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా సిద్ధం కాగా.. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వాయిదా వేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఐపీవోను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఐపీవోను వాయిదా వేసేందుకు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు,… -
Russia Ukraine War: రెండో దఫా శాంతి చర్చలు ప్రారంభం..
రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధంలో ఇరుదేశాలు భారీ నష్టాన్నే చవిచూశాయి. ఉక్రెయిన్‌పై ఎనిమిది రోజులుగా సాగిస్తోన్న యుద్ధానికి సంబంధించిన వివరాలను రష్యా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. యుద్ధంలో ఇప్పటివరకు 498 మంది సైనికులను కోల్పోయామని రష్యా ప్రకటించింది. 16 వందల మంది రష్యా సైనికులు గాయపడ్డారని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఉక్రెయిన్‌కు చెందిన ఎస్-300, బీయూకే-ఎం1 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ వ్యవస్థను రష్యా ధ్వంసం చేసింది. పలు మిలటరీ హెలికాప్టర్లు, నాలుగు డ్రోన్లను నేలకూల్చింది.… -
Russia Ukraine War: రష్యాకు బిగ్ షాక్.. మేజర్ జనరల్ హతం
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా… ఓవైపు చర్చలు అంటూనే.. మరోవైపు భీకర దాడులకు పాల్పడుతోంది… ఇక, అదే స్థాయిలో ఉక్రెయిన్ నుంచి కూడా ప్రతిఘటన ఎదురవుతోంది రష్యా బలగాలకు.. ఇరు దేశాలకు చెందిన సైనికులతో పాటు.. ప్రజలు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు.. కేవలం సైనికులే కాదు.. కీలక అధికారులు కూడా ప్రాణాలు కోల్పోవడం రష్యాకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.. యుద్ధం మొదలై ఎనిమిది రోజులైనప్పటికీ ఉక్రెయిన్‌లో విధ్వంసం మాత్రం కొనసాగుతూనే ఉంది.. యుద్ధం మొదట్లో…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!