రష్యా ఆధీనంలో ఉన్న లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌లోని ఓ ఆస్పత్రిపై ఉక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
అత్యాధునిక యుద్ధ ట్యాంకులు సరఫరా చేస్తామని అమెరికా, జర్మనీలు ప్రకటించిన నేపథ్యంలో రష్యా దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఉక్రెయిన్‌లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని చేసిన క్షిపణి దాడుల్లో దాదాపు 11 మంది మృతి చెందారు.
అమెరికా తన సొంత యుద్ధ ట్యాంకులను పంపడానికి అంగీకరిస్తే రష్యాకు వ్యతిరేకంగా రక్షించడంలో సహాయపడటానికి జర్మనీ తయారు చేసిన ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపడానికి జర్మనీ అనుమతిస్తుందని బెర్లిన్ ప్రభుత్వం ప్రకటించింది.
Ukraine Chopper Crash: ఉక్రెయిన్ లో ఘోరం జరిగింది. రాజధాని కీవ్ కు సమీపంలో ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ హోంమంత్రి, డిప్యూటీ హోంమంత్రితో సహా మొత్తం 16 మంది మరణించారు. ఉక్రెయిన్ అధికారులు బుధవారం ఈ ప్రమాదం గురించి తెలిపారు. చనిపోయిన వారిలో హోం మంత్రి డెనిస్ డెనిస్ మొనాస్టైర్స్కీ మరియు అతని మొదటి డిప్యూటీ మినిస్టర్ యెవ్జెనీ యెనిన్‌తో సహా అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. మరణించిన…
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లోని నీప్రో నగరంలో ఓ అపార్టుమెంట్‌పై రష్యా శనివారం జరిపిన దాడిలో మృతుల సంఖ్య 40కి చేరింది.
Ukraine War: ఉక్రెయిన్ పై మరోసారి రష్యా విరుచుకుపడింది. శనివారం క్షిపణులతో దాడి చేసింది. రష్యాతో జరుగుతన్న యుద్ధంతో ఉక్రెయిన్ కు యుద్ధ ట్యాంకులను అందచేస్తామని బ్రిటన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడులు చేసింది. ఇదిలా ఉంటే రష్యా క్షిపణల శిథిలాలు తమ భూభాగంలో పడ్డాయని మల్డోవా దేశం ఆరోపించింది. తూర్పు ప్రాంతంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన డ్నిప్రోలో పై క్షిపణులతో దాడి చేసింది.
Pakistan set to dispatch 159 containers of ammunition to Ukraine: రష్యా-ఉక్రెయిన్ నేపథ్యంలో పాకిస్తాన్ దేశం ఉక్రెయిన్ కు సహకరిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఉక్రెయిన్ కు సైనిక సాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాాజాగా మరోసారి భారీగా పేలుడు పదార్థాలను పంపాలని యోచిస్తోంది. ప్రొజెక్టైల్స్, ప్రైమర్ లతో పాటు 159 కంటైనర్ల పేలుడు సామాగ్రిని పంపనుంది. పాకిస్తాన్ షిప్పింగ్, బ్రోకరేజ్ సంస్థ ప్రాజెక్ట్ షిప్పింగ్ పాకిస్తాన్ కోసం 159 కంటైనర్ల మందుగుండు…
కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఉక్రెయిన్‌కు పలు దేశాలు ఆయుధాలు సరఫరాతో పాటు ఆర్థికంగా సహాయం అందిస్తున్నాయి.