ప్రస్తుతం రష్యాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రష్యన్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రష్యా ఎన్నికలకు భారత్‌లోనూ ఓటింగ్ జరుగుతోంది. రష్యా ఎన్నికలకు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కూడా ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ విజయం దాదాపు ఖాయమని చెబుతున్నారు.