Russia: ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో రష్యా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గత రెండు దశాబ్ధాలుగా అధికారంలో ఉన్న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల తేదీని రష్యా చట్టసభ సభ్యులు నిర్ణయించారు. వచ్చే ఏడాడి (మార్చి 17, 2024)న అధ్యక్ష ఎన్నికలు జరపాలని నిర్ణయానికి ఆమోదం తెలిపారు.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2024 ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఆయన 2030 వరకు అధికారంలో ఉండేందుకు మార్గం సుగమం అవుతుందని ది టెలిగ్రాఫ్ ఒక నివేదికలో పేర్కొంది. 1999లో బోరిస్ యెల్ట్సిన్ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పుతిన్ అప్పటి నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాకు అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు.