నిత్యం భక్తులతో కళకళలాడే తిరుమలకు భక్తులతో పాటు అడవుల్లో వుండే వన్యప్రాణులు కూడా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం చిరుతపులులు, ఎలుగుబంట్లు, పాములు, జింకలు ఘాట్ రోడ్లపై కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుమలలో వన్యప్రాణులు సంచారం కొనసాగుతుంది. సీజన్ బట్టి జంతువులు సంచరిస్తుంటాయి. ఆ మధ్య చిరుతలు….మొన్నటి వరకు ఏనుగులు సంచారంతో భక్తులు భయభ్రాంతులకు గురికాగా….తాజాగా ఎలుగుబంట్లు సంచారం భక్తులుతో పాటు స్థానికులును ఆందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం అర్దరాత్రి సమయంలో ఏకంగా మూడు ఎలుగు బంట్లు…