Minister Seethakka : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఆలయ పాలక వర్గం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పరిగి ,కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ రైతు వ్యవసాయ మానేస్తే కుక్కకు కూడా అన్నం దొరకదని అన్నారు. అదేవిధంగా పేదింటి బిడ్డలు సన్న…
ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి అవార్డు లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకుని ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు గ్రామపెద్దలు
Ponguleti Srinivas Reddy : ప్రజాపాలనలో అప్లై చేసి కొని వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్లలో అప్లై చేసేకునే అవకాశం ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో 10 కొత్త అంశాలు చేర్చాము. సర్వే అధికారుల రికమండేషన్ ఆప్షన్ తీసివేశామని, ఇప్పటి వరకు 2లక్షల 32 వేల దరఖాస్తులను యాప్ లో నమోదు చేశామన్నారు. ఆలస్యం అయిన అసలైన లబ్ధి దారులకు ఇల్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐటీడీఏ, ట్రైబల్ ఏరియాలో…
Duddilla Sridhar Babu : పెద్దపల్లి జిల్లా మంథని అయ్యప్పస్వామి, దత్తాత్రేయ స్వామి దేవాలయాలలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి అయ్యప్ప స్వాములు శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు. మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామానికి జాతీయ అవార్డు దక్కడంతో ఆ గ్రామ మహిళ సంఘ అధ్యక్షురాలును శాలువాలతో మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అత్యుత్తమ పనితీరును కనబరిచిన పంచాయతీలకు కేంద్ర సర్కారు ఇచ్చే జాతీయ స్థాయి పురస్కారాలుకు నాలుగు గ్రామాలు ఎంపిక కావడం విశేషం.
కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశ (కేంద్ర విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ) సమావేశానికి స్థానిక ఎంపీ రఘువీర్ రెడ్డి అధ్యక్షత వహించగా, జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, కేటీఆర్ సిరిసిల్ల నేతన్న ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.
రాజకీయాలు, రైతులు, చెరుకు పరిశ్రమకు సంబంధించి ముఖ్యమైన వ్యాఖ్యలు చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్ రాజనర్సింహ రాయికోడ్ మండలం మాటూరు గ్రామంలో, గొదావరి గంగా ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (చక్కెర ఫ్యాక్టరీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్టీలకు, కులాలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన ఖమ్మం రూరల్ మండలం దానావాయిగూడెంలో మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ మొదలవుతుందని, ఇందిరమ్మ ఇళ్ల కోసం యాప్ ను తయారు చేశామన్నారు.