కోటి మంది మహిళలను ఆర్థికంగా బలంగా చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ప్రతి మహిళను స్వయం సహాయ సంఘాల్లో చేర్చే దిశగా అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ మాట్లాడుతూ.. ఈనెల నవంబర్ 6, 7 నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం గ్రామ సభలు నిర్వహిస్తామని, రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు.
దేవరగట్టు కర్రల సమరంలో హింసను నియంత్రించేందుకు పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. అధికారులు రూపొందించిన ప్రణాళికలు అమలవ్వకపోవడం వల్ల ఈ సమరంలో 70 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో ప్రతి సంవత్సరం దసరా రోజు అర్ధరాత్రి బన్ని ఉత్సవం జరగుతుంది. ఈ ఉత్సవంలో కర్రల సమరం జరిగి, ఇద్దరు…
ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అధికారులను శనివారం సాయంత్రం లోగా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారిని చైర్మన్‌గా నియమించనున్నారు. కమిటీలో ఇద్దరు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఇందులో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు తప్పనిసరిగా ఉండాలి. ఈ కమిటీకి పంచాయతీ…
ఈ రోజు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యారణం శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు.. రాష్ట్రంలో చేపట్టబోతున్న నరేగా పనులు, ఈ నెల 23వ తేదీన గ్రామసభల నిర్వహణపై ముఖ్యంగా సమీక్షించను్నారు..
రోడ్ల నాణ్యతపైనా మరింత దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వేసిన మరుసటి సంవత్సరమే మళ్లీ రిపేరు చేయాల్సిన పరిస్థితి రాకూడదన్నారు.. ఇంజినీర్లు వీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష సందర్భంగా ఉపాధి హామీపై కూడా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాథి హామీలో భాగంగా ఈ ఏడాది 1500 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.. ఇప్పటి వరకూ 215.17…
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంపై నిర్లక్ష్యం వహించిన వారిపై వికారాబాద్ కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. నలుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయడమే కాకుండా మండల పంచాయతీ అధికారిపై బదిలీ చేశారు ఆమె. పల్లెప్రగతి పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సంబంధిత అధికారులను హెచ్చరించారు. పల్లె ప్రగతి పనుల్లో ప్రభుత్వం నిర్దేశించిన అంశాల్లో నిర్లక్ష్యం వహించిన పూడూరు మండలం, చింతల్‌పల్లి పంచాయతీ కార్యదర్శి హమీద్, గొంగుపల్లి…