“ఆర్ఆర్ఆర్” చిత్ర బృందం ప్రమోషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” అంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సాంగ్ స్పెషల్ ఏంటంటే ఇందులో ప్రత్యేకంగా తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా పాలు పంచుకున్నాడు. జరుగుతున్న ప్రచారం ప్రకారం అనిరుధ్ “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్ కి సంగీతం సమకూరుస్తున్నారు.…