దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్”. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఇద్దరు నిజమైన స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీం మధ్య కల్పిత స్నేహం చుట్టూ తిరుగుతుంది. గిరిజన నాయకుడు భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా విడుదలకు దగ్గర పడుతున్న కారణంగా ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…