టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ముందు వరుసలో ఉన్నాయి. రాబోయే సంక్రాంతి పండుగ సీజన్ లో రెండు సినిమాలూ క్లాష్ కాబోతున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” జనవరి 7న థియేటర్లలోకి రానుంది. మరోవైపు ప్రభాస్, పూజా హెగ్డేల “రాధే శ్యామ్” చిత్రం జనవరి 14న బిగ్ స్క్రీన్‌ల పైకి రానుంది. దేశవ్యాప్తంగా అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఈ సినిమా గురించి…