Glenn Maxwell imitating Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. శుక్రవారం (మార్చి 22) చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెపాక్‌లో ముమ్ముర సాధన చేస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం మంగళవారం రాత్రి ఆర్‌సీబీ జట్టు చెన్నైకి చేరుకుని ప్రాక్టీస్…
Navjot Singh Sidhu Heap Praise on Virat Kohli: సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ మరియు సర్ వివ్ రిచర్డ్స్ కంటే విరాట్ కోహ్లీనే ‘ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాటర్’ అని భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నారు. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ కోహ్లీ అని అభిప్రాయపడ్డారు. మూడు ఫార్మాట్లకు అనుగుణంగా ఆడే అసాధారణ నైపుణ్యాన్ని విరాట్ కలిగి ఉన్నాడని ప్రశంసించారు. విరాట్ పరుగుల దాహానికి అతని ఫిట్‌నెస్ ప్రధాన కారణం అని…
Smriti Mandhana on Virat Kohli To Win IPL Title: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, తనకు మధ్య పోలిక సరికాదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధన అన్నారు. టైటిల్ ముఖ్యమైందే కానీ భారత జట్టు తరఫున విరాట్ ఎన్నో సాధించాడన్నారు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఆర్‌సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ‘ఆర్‌సీబీ అన్‌బాక్స్’ పేరిట ఓ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ సందర్భంగా…
Virat Kohli React on RCB Title: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) టైటిళ్ల సంఖ్యను డబుల్ చేస్తాం అని ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ గెలిచిన క్షణాన బెంగళూరు నగరమే టైటిల్ గెలిచిన ఫీలింగ్ కలిగిందన్నాడు. ఇన్నేళ్ల పాటు అభిమానులు తమపై ఉంచిన నమ్మకాన్ని త్వరలోనే నెరవేరుస్తామని కింగ్ తెలిపాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన ఆర్‌సీబీ అన్‌బాక్స్…
ఆర్సీబీ (RCB) పేరు మారింది. Royal Challengers Bangalore గా ఉన్న ఫ్రాంచైజీ పేరును Royal Challengers Bengaluruగా మార్చారు. ఈ విషయాన్ని ఆర్సీబీ అధికారిక ఎక్స్ పేజీలో షేర్ చేశారు. ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ అన్ బాక్స్ 2024 కార్యక్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 2014వ సంవత్సరంలో నగరం పేరును Bangalore నుంచి Bengaluruగా స్పెల్లింగ్ మార్చారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఇదొక శుభవార్త. ఆర్సీబీ (RCB) కొత్త జెర్సీ లీక్ అయింది. ఈ జెర్సీని ఆర్సీబీ రివీల్ చేయాల్సి ఉండగా.. జెర్సీ లీక్ అయిపోయింది. ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కొత్త జెర్సీలో కనిపిస్తున్నారు. కోహ్లీ తన జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోవైపు కోహ్లి, సిరాజ్‌లు కొత్త జెర్సీ ధరించిన ఫొటో వైరల్ అవుతోంది.
Can RCB do the WPL-IPL double: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 16 ఏళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పురుషుల జట్టుకు సాధ్యం కాని ఘనతను.. మహిళా జట్టు సాధించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లోనే స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టు ట్రోఫీ గెలిచింది. ‘ఇస్ సాలా కప్ నమదే’ అని ప్రతి ఏడాది సందడి చేసే బెంగళూరు ఫ్యాన్స్.. ‘ఇస్ సాలా కప్ నమ్దూ’ అంటూ సగర్వంగా తలెత్తుకునేలా మహిళా…
విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు జట్టు ఫైనల్‌లో ఘన విజయం సాధించింది. ఢిల్లీపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 113 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి మందన సేన అలవోకగా విజయం సాధించింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) రెండో ఎడిషన్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. అనూహ్యంగా ఫైనల్‌కు చేరిన బెంగళూరు టీమ్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 113 పరుగులకే ఆలౌట్ చేసింది.
SRH Clinches Kite Festival 2024, RCB as Runner-Up: ఇండియన్ పతంగ్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో హైదరాబాద్ పైచేయి సాధించింది. దాంతో ఇండియన్ పతంగ్ లీగ్ 2024 విజేతగా హైదరాబాద్ నిలిచింది. మకర సంక్రాంతి మరియు లోహ్రీ శుభ సందర్భంగా ప్రముఖ క్రీడా ఛానెల్ ‘స్టార్ స్పోర్ట్స్’ గాలిపటాల పోటీని అహ్మదాబాద్‌లో నిర్వహించింది. ఈ పోటీలో ఐపీఎల్ జట్ల అభిమానులు పోటీపడ్డారు.ఇక్కడ విశేషం…