Can RCB do the WPL-IPL double: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 16 ఏళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పురుషుల జట్టుకు సాధ్యం కాని ఘనతను.. మహిళా జట్టు సాధించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లోనే స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టు ట్రోఫీ గెలిచింది. ‘ఇస్ సాలా కప్ నమదే’ అని ప్రతి ఏడాది సందడి చేసే బెంగళూరు ఫ్యాన్స్.. ‘ఇస్ సాలా కప్ నమ్దూ’ అంటూ సగర్వంగా తలెత్తుకునేలా మహిళా టీమ్ చేసింది. ట్రోఫీ గెలిచిన ఆర్‌సీబీ వుమెన్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
డబ్ల్యూపీఎల్ 2024లో ఆర్‌సీబీ టైటిల్ సాధించడంతో.. ఐపీఎల్ 2024లో సైతం ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని పురుషుల జట్టు కూడా కప్ సాదిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం ఆర్‌సీబీ కప్పు కొడుతుందని జోస్యం చెప్పాడు. ‘అద్భుతమైన టోర్నమెంట్. ఈ విజయంకు ఆర్‌సీబీ మహిళలు అర్హులు. ఇక పురుషులు ఆర్‌సీబీ ట్రోఫీని డబుల్ చేస్తారా?. ఈ ఏడాది ఆర్‌సీబీదే కప్’ అని వాన్ ఎక్స్‌లో పేర్కొన్నాడు. వాన్ జోస్యం నిజమైతే బాగుండని ఆర్‌సీబీ అభిమనులు కోరుకుంటున్నారు.
Also Read: Sarfaraz Khan-IPL 2024: సర్ఫరాజ్ ఖాన్‌కు లక్కీ ఛాన్స్.. అప్పుడు వద్దన్నవాళ్లే..!
డబ్ల్యూపీఎల్ 2024 టైటిల్ ఆర్‌సీబీ గెలవడంతో.. ఐపీఎల్ 2024లో ఆడే ఆర్‌సీబీ జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహిళా టీం మాదిరే.. పురుషుల టీమ్ కూడా కప్ సాధించాలని ఆర్‌సీబీ ఫాన్స్ కోరుకుంటున్నారు. మరి ట్రోఫీని డబుల్ చేస్తారా? లేదా ఎప్పటిలానే ఉత్తి చేతులతో ఇంటికి వస్తారో చూడాలి. ఆర్‌సీబీ ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్ చేరి.. తుది మెట్టుపై బోల్తా పడింది. 2009, 2011, 2016లో ఫైనల్‌కు దూసుకెళ్లినా.. వరుసగా డెక్కన్ ఛార్జర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల చేతిలో ఓడిపోయింది.
Fantastic tournament .. Well deserved win for @RCBTweets !! Now can the Men do the double !!! This could be the year … https://t.co/1yjDWD3wFo
— Michael Vaughan (@MichaelVaughan) March 17, 2024