ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఉన్నారు. వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉండటంతో ఆ జట్టుకు క్రేజ్ విపరీతంగా ఉంటోంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ఆ జట్టుకు క్రేజ్ అయితే తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్న టాప్-3 క్రీడా జట్టుల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు చోటు దక్కింది. ఏప్రిల్ 2022లో…
ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుకున్నాయి. నాలుగో స్థానం కోసం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ నెలకొంది. ఈరోజు రాత్రికి జరిగే మ్యాచ్ నాలుగో బెర్తును ఖరారు చేయనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కథ ముగుస్తుంది. అందుకే ముంబై ఇండియన్స్ జట్టు…
ఐపీఎల్‌లో గురువారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీలో ఫైర్ కనిపించింది. ముఖ్యంగా అభిమానులకు పాత కోహ్లీని గుర్తుకుతెచ్చాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 73 పరుగులు చేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. విరాట్ బ్యాట్ నుంచి పరుగులు వెల్లువెత్తడంతో అతడి పేరిట రికార్డుల మోత కూడా మోగింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కోహ్లీ 14 మ్యాచ్‌లు ఆడి 309 పరుగులు చేశాడు. దీంతో 15…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ అంత ఆశాజనకంగా రాణించలేదనే చెప్పుకోవాలి. మొదట్నుంచీ అతడు నిరాశపరుస్తూనే వచ్చాడు. మధ్యలో ఓసారి అర్థశతకం సాధించాడు కానీ, అది వింటేజ్ కోహ్లీ ఇన్నింగ్స్ అయితే కాదు. మరీ నిదానంగా రాణించడంతో, క్రికెట్ ప్రియులకు అది అంత కిక్ ఇవ్వలేదు. కానీ, నిన్న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ ఉగ్రరూపం దాల్చాడు. ఏ కోహ్లీని అయితే క్రీడాభిమానులు చూడాలనుకున్నారో, ఆ కోహ్లీ విజృంభించాడు. ఎడాపెడా షాట్లతో మైదానంలో పరుగుల…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్ ఆశలను ఆ జట్టు సజీవంగా ఉంచుకుంది. ఆర్సీబీ విజయంతో హైదరాబాద్, పంజాబ్ జట్లు మాత్రం ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో ఈ రెండు జట్లు 22న తమ చివరి మ్యాచ్‌లో నామమాత్రంగా తలపడనున్నాయి. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విధించిన 169 పరుగుల…
ఐపీఎల్ సీజన్ 2022లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే.. నేడు ముంబాయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా.. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును ఆర్‌సీబీ ముందు పెట్టారు. 60 పరుగుల…
ఐపీఎల్ సీజన్ 2022లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే.. నేడు ముంబాయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా.. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే.. పంజాబ్ కింగ్స్ తుది జట్టులో ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ స్థానంలో స్పిన్నర్ హర్‌ప్రీత్ బరార్ జట్టులోకి తీసుకుంటున్నట్లు మార్పు చేసినట్లు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తెలిపారు.…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ‘మిస్టర్ 360’ ఏబీ డీ విలియర్స్‌కి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తన హోమ్ టీమ్‌గానే ఆ జట్టుని గౌరవిస్తాడు. విరాట్ కోహ్లీతోనూ ఇతనికి మంచి అనుబంధం ఉంది. ఈ జోడీని చూసినప్పుడల్లా క్రికెట్ అభిమానులు మురిసిపోతుంటారు. కానీ, ఈ సీజన్ నుంచి మళ్ళీ ఏబీడీని చూడలేదమని, అతని 360 ఆటను చూడలేమని తెలిసి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఏబీడీ..…
ఈ ఏడాది ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. రెండు మ్యాచుల్లో పర్వాలేదనిపించాడు కానీ, మిగిలిన మ్యాచెస్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. నిజానికి.. ఈసారి కోహ్లీ అదరగొడతాడని, తన రాయల్ ఛాలెంజర్స్ జట్టుని ఛాంపియన్‌గా నిలబెడతాడని ఫ్యాన్స్ ఎంతో ఆశించారు. కానీ, అందుకు భిన్నంగా ఇతడు పేలవ పెర్ఫార్మెన్సెస్‌తో ఆ ఆశల్ని నీరుగారుస్తున్నాడు. ఈ సీజన్‌లో అతడు మూడుసార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడంటే, అతని ప్రదర్శన ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ మరోసారి గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. అతడు ఈ టోర్నీలో గోల్డెన్ డకౌట్ కావడం ఇది మూడోసారి. అయితే మరో ఓపెనర్ డుప్లెసిస్ మాత్రం మెరుపు వేగంతో ఆడాడు. 50…