అయితే ఇస్రో ఈ రోజు ల్యాండర్, రోవర్ తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే ఇంత వరకు గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు ఎస్టాబ్లిష్ కాలేదని ఇస్రో తెలిపింది. సంబంధాలు ఏర్పరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తామని ప్రకటించింది.
Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ఒక్కసారిగా ఇస్రో, భారత్ కీర్తి పెరిగాయి. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన అమెరికా, రష్యా, చైనాల తరువాత నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ని దించిన తొలిదేశంగా భారత్ నిలిచింది.
అంతరిక్ష పరిశోధన చరిత్రలో మొట్టమొదటిసారిగా చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై నేల ఉష్ణోగ్రతను వివరించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన విక్రమ్ ల్యాండర్‌లోని ChaSTE(చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్) పేలోడ్ సహాయంతో చంద్రయాన్-3 చేసిన పరిశోధనలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 మిషన్ లక్ష్యాలలో మూడింటిలో రెండింటిని సాధించామని ఇస్రో తెలిపింది.
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ కదలికలన్నింటినీ ధ్రువీకరించామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తెలిపింది. చంద్రయాన్-3 రోవర్ 'ప్రజ్ఞాన్' ఎనిమిది మీటర్ల దూరం విజయవంతంగా ప్రయాణించిందని, దాని పేలోడ్‌లను ఆన్ చేసినట్లు ఇస్రో శుక్రవారం వెల్లడించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగింది. బుధవారం అంటే ఆగస్టు 23 భారతదేశానికి, ప్రపంచానికి చారిత్రాత్మకమైన రోజు. ల్యాండ్ అయిన రెండు గంటల 26 నిమిషాల తర్వాత రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండర్ 'విక్రమ్' నుంచి బయటకు వచ్చింది.