చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా నిత్యం యాక్టివ్ గా వుంటారు. ఒకవైపు ప్రజాప్రతినిధిగా, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా క్షణం ఖాళీ లేకుండా గడుపుతారు. మధ్యలో జబర్దస్త్ లాంటి కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని కూడా పంచుతుంటారు. తన స్వంత ఊరు నగరిలో పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఒకవైపు రాజకీయ నేతగా బిజీగా ఉన్నా సామాజిక కార్యక్రమాలకు ఆమె టైం కేటాయిస్తూ ఉంటారు. ఆటల్లోనూ పాల్గొంటూ వుంటారు. బుధవారం…
సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రోజా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. తెరపై అందాలతారగా జనానికి శ్రీగంధాలు పూసిన రోజా, కొన్ని అరుదైన పాత్రల్లోనూ అభినయంతో అలరించారు. మాతృభాష తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళంలోనూ తనదైన బాణీ పలికించారు రోజా. రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు రోజా. ఇక బుల్లితెరపై ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలు సైతం ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్నాయని చెప్పవచ్చు. రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. 1972 నవంబర్ 17న తిరుపతిలో జన్మించారు. పద్మావతి…