IND vs WI 1st Test Highlights: డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 130 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో రోహిత్ సేన ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ (7/71) మరోసారి తన స్పిన్ మాయాజాలం చూపించాడు. అరంగేట్రంలోనే సెంచరీతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ విజయంతో…
తొలి టెస్టు ఆడుతున్న యశస్వి జైస్వాల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ, తన క్లాస్ బ్యాటింగ్ చూపించాలని తపన పడుతున్నాడంటే ఏమో అనుకోవచ్చు.. కానీ విరాట్ కోహ్లీ కూడా తన జిడ్డు బ్యాటింగ్‌తో అందరిని విసిగించాడు. మొదటి బంతికి ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్న విరాట్, 96 బంతులు ఆడి ఒకే ఒక్క ఫోర్ కొట్టాడు.. అది కూడా 81 బంతులు ఆడిన తర్వాత వచ్చింది.
West Indies vs India 1st Test Day 2 Highlights: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. అరంగేట్ర ప్లేయర్ యశస్వి జైస్వాల్ (143 బ్యాటింగ్; 350 బంతుల్లో 14 ఫోర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (103; 221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో టీమిండియా పట్టుబిగించింది. రెండో రోజైన గురువారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్…
West Indies vs India 1st Test Day 1 Highlights:వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు మంచి ఆరంభం దక్కింది. ముందుగా విండీస్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన రోహిత్ సేన.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30), యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 70 పరుగుల…
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఇవాళ్టి( బుధవారం) నుంచి డొమినికా వేదికగా తొలి టెస్ట్ మ్యా్చ్ జరుగనుంది. ఇక విండీస్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. టీమిండియా తరఫున ఇషాన్ కిషన్ టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో అతడు వికెట్ కీపర్‌గా ఆడనున్నాడు.
వెస్టిండీస్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్రస్తుత తరం భారత క్రికెటర్లలో మాత్రం వీరిద్దరిలో ఎవరూ కూడా టాప్‌లో లేకపోవడం గమనార్హం. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా విండీస్‌తో తమ తొలి సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలో డొమినికా వేదికగా ఇవాళ్టి (బుధవారం) నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో తమ స్థాయికి తగ్గట్లు కెప్టెన్ రోహిత్, కోహ్లి రాణించలేక పోయారు.
ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ) తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా స్టార్ ట్రవిస్ హెడ్ దుమ్ములేపాడు. ఇంగ్లండ్ తో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో రాణిస్తున్న ఈ ఎడమచేతివాటం బ్యాటర్ నంబర్ 1 స్థానానికి గురిపెట్టాడు. అయితే.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా రిలీజ్ చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్.. కేన్ విలియమ్సన్…
టీమిండియాలో ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయింది.. మన పని ఏంటి? అది చేశామా.. లేదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, కనీసం పక్కనున్న ప్లేయర్ ఎలా ఉన్నాడు? ఏం ఆలోచిస్తున్నాడనే విషయాలను కూడా పట్టించుకోవడం లేదని ఆర్. అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అశ్విన్ చేసిన కోలిగ్స్ కామెంట్లు నన్ను చాలా బాధపెట్టాయని సీనియర్ క్రికెటర్ సునీల్ గావాస్కర్ అన్నారు. ఎందుకంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకోకపోతే ఎలా? క్రికెట్ గురించి కాకపోయినా మ్యూజిక్ గురించి, సినిమాల గురించి,…
తాజాగా హిట్‌మ్యాన్ వెయిట్‌లాస్ కావడంతో అతను గత ఫామ్‌ను అందుకుంటాడనే నమ్మకం వస్తుంది. రోహిత్ బరువు తగ్గేందుకు చాలా కష్టపడ్డట్లు తెలుస్తుంది. కఠినమైన డైట్, వ్యాయామాలు చేస్తే తప్పిస్తే అంత ఔట్పుట్ రాదు. రోహిత్‌ను ఇప్పుడు చూసిన వారెవరైనా.. ఏంటీ మరీ ఇంత సన్నబడ్డాడని అతని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.